మైక్ దొరకట్లేదంటూ తెగ ఫీలవుతున్న చైర్మన్ చక్రపాణి

March 31, 2016 | 11:15 AM | 1 Views
ప్రింట్ కామెంట్
AP-Council-chairman-Chakrapani-jokes-in-assembly-niharonline

చట్ట సభల్లో సభ్యులు మాట్లాడేందుకు మైక్ దొరికితే చాలు నమిలి మింగేస్తారు. ముఖ్యంగా అధికార సభ్యులు ఎక్కువ సమయం లాక్కునేందుకు ప్రయత్నిస్తుంటే, విపక్షాలు ఉన్నంతలో ఎగిసిపడుతూ లాగించేస్తుంటారు. అలాంటి సందర్భంలో వారిని వారిస్తూ సభను సజావుగా సాగేలా చూసుకునేది సభాపతే. ఈ క్రమంలో సభాపతికి మైక్ దొరకకపోవడమనే సమస్యే రాదు. అలాంటిది ఏపీ శాసనమండలి సభాధ్యక్ష స్థానంలో ఉన్న చైర్మన్ చక్రపాణి నిన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

                                బుధవారం సమావేశాల్లో భాగంగా మండలికి వచ్చిన సీఎం నారా చంద్రబాబునాయుడు ఉన్నత విద్యపై సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఆ తర్వాత చైర్మన్ అనుమతి లేకుండానే అటు అధికార, ఇటు విపక్ష సభ్యులు తమ తమ అభిప్రాయాలను సీఎంకు చెప్పారు. చైర్మన్ మైకివ్వకున్నా సభ్యులు లేచి మాట్లాడటం, దానికి సీఎం చంద్రబాబు సమాధానాలు చెప్పుకుంటూ పోవడం కనిపించింది. ఈ క్రమంలో చక్రపాణి కల్పించుకుని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘నాకూ మైక్ కావాలి. నాకు అవకాశం రావడం లేదు. నాకొక అవకాశం ఇస్తే మాట్లాడాలనుకుంటున్నా. కానీ, ఒకరి తర్వాత ఒకరు మీరే మాట్లాడుతున్నారు’’ అని ఆయన అన్నారు. దీంతో సభలో సభ్యులంతా ఒక్కసారిగా నవ్వేశారు. సరదాగానే ఆయన చేసిన వ్యాఖ్యలు సభలో నవ్వులు పూయించాయి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ