ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున అధికారికంగా శ్రీరామ నవమి వేడుకలు నిర్వహించేందుకు కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీకోదండ రామాలయాన్ని ఎంపికచేసింది. రాష్ట్రం విడిపోకముందు వేడుకలను ఖమ్మం జిల్లా భద్రాచలంలో నిర్వహిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి లేదా సంబంధిత దేవాదయ శాఖ మంత్రి స్వామివారికి పట్టు వస్రాలు సమర్పించేవారు. విభజన నేపథ్యంలో భద్రాచల ఆలయం అధికారికంగా తెలంగాణ రాష్ట్ర పరిధిలోకి వెళ్లింది. దీంతో మార్చి 28న నిర్వహించనున్న నవమి వేడుకలు అధికారికంగా జరిపేందుకు ఒంటిమిట్టలోని రామాలయాన్ని ఎంపిక చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. దీనికి సంబంధించిన అధికారిక జీవో విడుదల కావాల్సి ఉంది.