తమిళనాడు గవర్నర్ రోశయ్యపై అక్కడి విపక్షాలు ఇప్పుడు కారాలు మిరియాలు నూరుతున్నాయి. కారణం ఆయనగారు అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి జయలలితను పొగడటమే. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ... అనేక అంతరాష్ట్ర జలవివాదాల్లో జయ వైఖరిని ప్రశంసించారు. ముఖ్యంగా ముళ్లై పెరియార్ డ్యాంకు సంబంధించి సుప్రీంతీర్పు తమిళనాడుకు అనుకూలంగా రావడానికి జయ పోరాటమే ఫలితమని ఆయన కితాబిచ్చాడు. దీంతో డీఎంకే అధినేత కరుణానిధి, పీఎంకే వ్యవస్థాపకుడు రామదాస్ రోశయ్యపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గవర్నర్ హోదాలో ఉండి ఓ నేర చరిత ఉన్న నేతను పొగడటం సరికాదని వారంటున్నారు. అయినా రోశయ్య సంగతి మనకు తెలియందా ఏంటీ. ఇక్కడ ఉమ్మడి రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా ఉన్నసమయంలో కూడా ఆయన వ్యాఖ్యలు ఎంతదుమారం రేపాయో తెలిసిందే కదా.