ఆ అప్పులు ఎగవేయండంటున్న బెజవాడ ఎమ్మెల్యే

December 12, 2015 | 11:23 AM | 1 Views
ప్రింట్ కామెంట్
bonda-uma-on-call-money-business-in-vijayawada-niharonline

విజయవాడలో గత కొద్దిరోజులుగా తీవ్ర కలకలం రేపుతున్న కాల్ మనీ వ్యాపారంపై మీడియాలో వరుసగా కథనాలు ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే. ముఠాలుగా ఏర్పడి అవసరం ఉన్న వారికి అధిక వడ్డీలకు అప్పులు ఇవ్వటమే కాకుండా, 10 నుంచి 25 రూ. చొప్పున దినసరి వడ్డీలను వసూలు చేయటం చేస్తున్నారు. వసూళ్లలో దారుణాలకు తెగపడటంతోపాటు అసాంఘిక కార్యకలపాలకు పాల్పడుతున్నారు. బెజవాడ కేంద్రంగా కోట్లలో ఈ దందా జరుగుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు మహిళలపై ఏకంగా లైంగిక దాడులు, వేధింపులు వంటి అకృత్యాలకు పాల్పడటం లాంటి విషయాలు ప్రస్తుతం వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రజా జీవితంపై కోరలు చాస్తోన్న ఈ కాల్ మనీ వ్యాపారంపై విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఘాటుగా స్పందించారు.

                                శనివారం ఉదయం మీడియతో మాట్లాడిన మంత్రి బోండా ఉమా... కాల్ మనీ అప్పులను చెల్లించవద్దని నగర ప్రజలకు పిలుపునిచ్చారు. తీసుకున్న అప్పుల్లో చిల్లిగవ్వ కూడా చెల్లించవద్దని పేర్కొన్న ఆయన, కాల్ మనీ వ్యాపారుల బెదిరింపులకు ఏమాత్రం బెదరవద్దని కూడా ఆయన సూచించారు. కాల్ మనీ వ్యాపారుల పీచమణిచేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ప్రకటించారు. బాధితులు పోలీసులను ఆశ్రయించాలని, వారి విషయాలను గోప్యంగా ఉంచుతామని నగర పోలీస్ కమిషనర్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ముఠాల వెనుక బడా నేతల హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ