దయాకర్ దండయాత్ర తుస్సుమంది

December 11, 2015 | 02:28 PM | 1 Views
ప్రింట్ కామెంట్
supreme_court_dismiss_Errabelli_defection_petition_niharonline

తెలంగాణతోపాటు పలు రాజకీయ పార్టీలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న తీర్పు రానే వచ్చింది. జంపింగ్ బాబుల విషయంలో ప్రస్తుతానికైతే తాము కల్పించుకోలేమని దేశ సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం తీర్పునిచ్చింది. తమ పార్టీకి, పార్టీ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయకుండా అధికార పక్షంలో చేరటమే కాదు మంత్రి పదవులు కూడా అనుభవిస్తున్నారని టీటీడీపీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. తక్షణం వారి రాజీనామాలు ఆమోదించి, ఎన్నికలు జరిపించాలని ఆయన పిటిషన్ లో పేర్కొన్నాడు. హైకోర్టు అది స్పీకర్ పరిధిలోని అంశమని చేతులెత్తేసింది. దీంతో ఆయన సుప్రీంలో పిటిషన్ వేశాడు.

కాగా దీనిపై  కొద్ది సేపటి క్రితం ధర్మాసనం విచారించింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత విషయంలో ప్రస్తుతానికి తాము కల్పించుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తలసాని తదితరులు ఈ వ్యవహారం రాష్ట్ర స్పీకర్ పరిధిలోనిదని ఈ దశలో తాము జోక్యం చేసుకోలేమని వెల్లడించింది. అయితే, మరో రెండు నెలల లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోకుంటే అప్పుడు మరోసారి తమ వద్దకు రావాలని స్పష్టం చేసింది. టీడీపీ నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్ణారెడ్డి, ధర్మారెడ్డి, మాధవరం కృష్ణారావు తదితరులు టీఆర్ఎస్ లో చేరిన సంగతి తెలిసిందే! కాగా, నిర్ణయం తీసుకోవాలని హైదరాబాద్ హైకోర్టు సూచించి 14 నెలలు గడిచినా, స్పీకర్ స్పందించడం లేదంటూ ఎర్రబెల్లి తరఫు న్యాయవాది బెంచ్ కి తెలిపారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ