అది వెంకన్న బాబు నేటివ్ ప్లేస్. అక్కడి ప్రభుత్వ కార్యాలయంలో మంత్రి నారాయణ నీరు, చెట్టు కార్యక్రమానికి సంబంధించిన సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ నీరు చెట్టు ఆలోచనకు పదును బెట్టి అమలు జరపమని చంద్రబాబు ఆదేశం. పైగా జరిగే సమావేశం నారా చంద్రబాబు నాయుడు సన్ ఆఫ్ ఆఫర్ నారా ఖర్జూర నాయుడు అవతరించిన పుణ్యపావన జిల్లా చిత్తూరు. ఇలాంటి వాతావరణంలో బాధ్యతయుతమైన మంత్రి నారాయణుడికి భావావేశం ఆవహించి తన్మయత్వంతో అధికారులకు ఓ సందేశం ఇచ్చాడు.
ఇది శ్రీవారి హృదయ వైశాల్యాన్ని ప్రతిబింబించే అంశం. ముఖ్యమంత్రికి ముద్దుబిడ్డ పథకమైన నీరు చెట్టు నిమిత్తం కొంత అంటే 5లక్షలు కేటాయించడం జరిగింది. అధికారులారా అది సాంతం దిగమింగేసి వాతాపి జీర్ణం అనకుండా, ఒక లక్ష రూపాయల పని అయిననూ చేసి చూపించండి నా అధికారులారా అని మంత్రి నారాయణ విజ్నప్తి చేశారు. ఇటువంటి అమూల్యమైన చాణక్య సలహాలు పెదవులకీ వినే చెవులకీ ఏ మాత్రం సందులేకుండా జాగ్రత్తపడాలి అనే వివేచన లోపించింది మంత్రికి. అప్పుడు జ్నప్తికి వచ్చింది ప్రాంగణంలో నారదుల వారి వారుసులు అంటే మీడియా వాళ్లు ఉన్నారేమో అని వాకబు చేశారట. ఆపై నాలుక కరుచుకున్నారు, భుజాలు తడుముకున్నారు. మొత్తం శ్రద్ధగా విన్న మహరాజాశ్రీ విలేఖరులు ఆ శుభసమయంలో నిష్క్రమించడం జరిగింది. కాలు సారించే ముందు చూపు సారించు అని రచయిత పతంజిత్ తెలుగులో విన్నవించుకున్నాడు. అంటే లుక్ బిఫోర్ యు వీప్ అని!