చచ్చిన పామునెందుకయ్యా మోదీ?

September 12, 2015 | 04:53 PM | 3 Views
ప్రింట్ కామెంట్
PM-Modi-on-congress-niharonline.jpg

ఒకానొక సినిమాలో రక్తకన్నీరు నాగభూషణం అంటాడుకదా, నా అర్థాంగి నన్నొదిలేసి ఎదుటింట్లో వేరేవాడితో నాముందే కాపురం పెట్టినా భరించగలను. కానీ పదవి లేకపోతే, పదవిపోతే భరించడం నావల్ల కాదు బ్రదర్ అని. అటువంటిది పదవి రుచిమరిగి, మరిగి, నిరాటంకంగా అనుభవించిన కాంగ్రెసు ఈ విరహం ఎలా భరించగలదని పదవిపోతే పదవినదిష్టించి కులాసాగా ఉన్న మోదీ అనుకుంటున్నాడు. ఇది న్యాయమా? ధర్మమా? ఇంతకీ దోషం బీజేపీది కాదట. ఓడించింది ప్రజలట. వారిపై కాంగ్రెస్ కక్షపూనిందట. పార్లమెంటును సవ్యంగా నడవనివ్వకుండా ఆటంకవాదిగా కాంగ్రెస్ క్రీడిస్తుందట. పురోగతిని పుట్టగతులు లేకుండా చేస్తుందట. తాము కూడ ఓడిపోయినప్పటికీ ప్రతీకార రాజకీయాలకు పాల్పడకుండా జనం మనసు జయించామని కుర్చీలో కుదురుగా బైఠాయించిన ప్రధాని వాక్ ప్రవాహం ఇది. నాలాంటి ఛాయ్ వాలా ఏంటీ? వారి నుంచి అధికారం పీక్కోవటం ఏంటని కాంగ్రెస్ ఉడుకు బోత్తనంతో పేదలను దునుమాడుతుంది. ఈ దఫా రెండు సీట్లు కూడా దక్కించుకోలేదు. కాంగ్రెస్ అని ప్రధాని అనుగ్రహ భాషణం చేసేరు. జైహింద్!

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ