ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై వస్తున్న విమర్శలను ఎదుర్కొవటం ప్రస్తుతం అధికార పక్షం టీడీపీ కి కష్టంగా మారింది. ప్రత్యేక హోదా ఉండబోదని కేంద్రం నుంచి స్పష్టమైన సంకేతాలు వచ్చిన తర్వాత, వాటి ఆధారంగా విమర్శలు చేసే ప్రతి పక్షం, ప్రభావం లేని కాంగ్రెస్, సీపీఎంలు ఇలా అన్ని పక్షాలు కలిసి తెలుగుదేశాన్ని ఎకిపడేస్తున్నాయి. అయితే ఎన్ని విమర్శలు వస్తున్నప్పటికీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించటం ఇప్పుడు అధికార నేతల వంతు అవుతోంది. తాజాగా మంత్రి పల్లో రఘునాథరెడ్డి తమ నేత చంద్రబాబు జోలికి రావొద్దంటూ గట్టిగానే వార్నింగ్ ఇస్తున్నాడు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కి తమ అధినేత చంద్రబాబు బానిస కాదని, ఆయన బాద్ షా అని ఆయన అభివర్ణించారు. ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ చీఫ్ రఘువీరారెడ్డి తలపెట్టిన దీక్షను ప్రస్తావిస్తూ, ఆయన దీక్ష ఈ దశాబ్దానికి అతిపెద్ద వింత అని అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహం తరాలు మారినా ప్రజలు మరిచిపోరని, ఆ పాపం వారిని వెంటాడుతూనే ఉంటుందని అన్నారు. ఇయన్నీ ఏమో గానీ అసలు ప్రత్యేక హోదా ఉంటుందా? తెచ్చే సీనుందా? తదితర విషయాలపై ఓ స్పష్టత ఇస్తే పార్టీలతోపాటు ప్రజలు కూడా ఆశలు పెంచుకోవాలా? తుంచుకోవాలా? అన్న అంశంపై ఓ స్ఫష్టతకు వస్తారు కదా మంత్రివర్యా!