సాధారణంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎవరినీ నమ్మరన్నే విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడది పూర్తి ప్రభుత్వానికి పాకిందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. కానీ, ఉద్యోగుల బదిలీలపై రాష్టప్రభుత్వం తాజాగా జారీచేసిన ఉత్తర్వులపై ఎన్‌జిఒల సంఘం ముఖ్యనేత ఒకరు చేసిన వ్యాఖ్య ఆ అనుమానాలకు బలం చేకూరుస్తుంది. ఈ బదిలీలకు ప్రధాన కారణం తాము నమ్మదగిన వారు ప్రభుత్వ యంత్రాంగంలో లేరని పాలకపక్షం భావించడమేనట. బదిలీల సడలింపు లక్ష్యం మొత్తం పాలనా యం త్రాంగంలో తమకు అనుకూలంగా వుండే వారితో నింపడమనేని అధికారపక్షం భావిస్తోందన్న అనుమానం ఎన్ జి వోలలో ఏర్పడింది. ఇటీవల కాలంలో రెవెన్యూ సెక్రటరీ దగ్గరనుంచి కలెక్టరు, ఎస్ పీ వరకు అన్ని పనులూ తాను ఒంటి చేతిమీద నిర్వహించాలని సీఎం ప్రయత్నించడాన్ని చూస్తుంటే ఈ విషయం నిజమేననిపిస్తుంది. హుద్ హుద్ తుపాన్, గోదావరి పుష్కరాలు అన్నింటినీ బాబు దగ్గరవుండి మరి అన్ని వ్యవహా రాలు చూసుకోవడం ఆయనకు ప్రశంసలు తెచ్చింది. అదే సమయంలో దిగువ స్థాయి ఉద్యోగినుంచి జిల్లాస్థాయి అధికారుల చేసే అన్ని పనులను తానే నెత్తిన వేసుకుని చేసుకోవటం ఉద్యోగులను కాస్త నిరాశపరిచింది. ప్రభుత్వాధినేతకు కూడా ఉద్యోగులపై నమ్మకం లేకపోతే ఎలా అని విమర్శలు అప్పుడే వచ్చాయి. ప్రభుత్వోద్యోగుల బదిలీల సడలింపు ఉత్తర్వుల జారీతో అదే తరహా విమర్శ మొత్తం తెలుగుదేశం పార్టీ వ్యవస్థ పైన వచ్చింది.
గతంలోఒకసారి బదిలీల సడలిరపు ఉత్తర్వులు జారీ చేసినప్పుడు జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రులకు బదిలీల క్లియరెన్స్‌ను అప్పగించడాన్ని రాజకీయజోక్యంగా ఎన్‌జిఒ సంఘాలు భావించాయి. దానిపై కొరత మంది ఉద్యోగ సంఘాల ప్రతినిధులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారిరచిన హైకోర్టు తాత్కాలికంగా ఆ ఉత్తర్వులను నిలుపుదల చేసిరది. ఈ నేపథ్యంలో అటువంటి మార్గదర్శకాలు ఉన్న అరశాలను తొలగిస్తూ తాజాగా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగుల బదిలీలపై నిషే ధాన్ని సడలిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిరది. ఈ బదిలీల ఉత్తర్వులు తక్షణమే అమలులోకి రానున్నాయి. ఆగస్టు 15వ తేదీ అర్ధరాత్రివరకు ఈ సడలింపు అమలులో ఉంటుంది. పదేళ్ళ తర్వాత అధికారంలోకి వచ్చాం.. పనులు ఏమీ జరగడం లేదనే అసంతృప్తిని జిల్లా స్థాయిలోని తెలుగుదేశం పార్టీ నేతలు చాలా సందర్భాలలో బాహాటంగానే వ్యక్తం చేశారు. కొందరు సీనియర్ నేతలు పార్టీ ఆధ్యక్షుడికీ తమ గోడు వినిపించుకున్నారు.కింది స్థాయిలో తమ మాట వినే ఉద్యోగులు వుండాలని వారు చేసిన విన్నవించు కున్నారు. ఫలితంగానే గత సారి బదిలీ ల సడలింపు ఉత్తర్వులలో ఇన్‌చార్జ్ మంత్రులకు పాత్ర కల్పించినట్లు కనిపిస్తోంది. అయితే అవి న్యాయ విచారణలో నిలబడలేదు.వాటిని న్యాయస్థానం నిలుపుదల చేసింది. మళ్ళీ కొత్త ఉత్తర్వులు జారీఅయ్యాయి. విద్యాసంవత్సరం ప్రారంభమైన తర్వాత బదిలీలపై సడలింపు తొలగించడం సరికాదని ఎన్ జిఒ సంఘం నేతలు అభిప్రాయపడుతున్నారు.
కావాలంటే కొన్ని పదుల బదిలీలు చేసుకునే విధంగా ఉత్తర్వులు జారీ చేసుకోవాలే కానీ, మూకుమ్మడి బదిలీలతో ఉద్యోగులకు ఇబ్బందులు కలుగుతాయని ఎన్ జి ఎ నేతలు అంటున్నారు. ఉద్యోగులపై ప్రభుత్వాధినేతకు నమ్మకం లేక, పార్టీ వర్గాలకు నమ్మకం లేకపోతే తాము పనిచేయడం ఎలా అని వారు ప్రశ్నిస్తున్నారు.