వామ్మో! ట్విట్టర్లో కూడా ఓదారుస్తారా ఏంటి?

February 26, 2015 | 12:32 PM | 78 Views
ప్రింట్ కామెంట్
jagan_official_twitter_niharonline

రాజకీయ నేతలకు సోషల్ మీడియాలో ఉన్న క్రేజీ ఫాలోయింగ్ ఎలా ఉంటుందో ప్రధాని మోదీ చూపించారు. ఇక ఆ తర్వాత నేతలంతా ఒక్కొక్కరుగా ఆయన రూట్ ను ఫాలో అవుతూ వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ చీఫ్ వైఎస్ జగన్ సోషల్ మీడియా లో ఖాతా తెరవనున్నారని గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. నాయకత్వ నేపథ్యంలో ఆయన పూర్తిగా ఏపీ కే పరిమితం కావటంతో ఇక్కడ తెలంగాణ లో ఆయన ద్రుష్టి సారించలేకపోతున్నారు. దీంతో సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యే అవకాశం ఉన్నందున ఆయన ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈ మేరకు బుధవారం ఆయన ట్విట్టర్ ఖాతాను ప్రారంభించారు. ఇక తొలి ట్వీట్ లోనే ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై విరుచుకుపడ్డారు. ‘‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రైతు వ్యతిరేక విధానాలు చేపడుతున్నారు. ఈ రైతు హత్యలకు కారకులు ఎవరు? మోసం చేసిన చంద్రబాబుదా? విఫలమైన అతని ప్రభుత్వానిదా? గట్టిగా ప్రశ్నించలేకపోయిన సమాజానిదా?’’ అని ఆయన ట్విట్టర్ వేదికగా ప్రశ్నలు గుప్పించారు. ఇప్పటి దాకా సుమారు 7568 మంది ఆయన ట్విట్టర్ ను ఫాలోఅవుతున్నారు. మరోపక్క ఇకపై దీన్ని వేదిక చేసుకుని ఓదారుస్తారా ఏంటి అంటూ టీడీపీ నేతలు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ