మరి కాసేపట్లో రైల్వే బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఛార్జీల పెంపు భారీగా ఉండవచ్చునని ఊహగానాలు వినవస్తున్నాయి. అన్ని కేటగిరీలలో ఛార్జీలపెంపుతోపాటు రవాణా సరుకులపై కూడా భారీ వడ్డింపు ఉండవచ్చునని విశ్లేషకులు భావించారు. అయితే వీటన్నింటికి ఇప్పుడు ముగింపు పలికారు రైల్వే మంత్రి సురేష్ ప్రభు. భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇస్తున్నారు ఆయన. తన బడ్జెట్ లో ప్రయాణికులపై ఛార్జీల మోత మోగించడం లేదని ముందుగానే చెప్పేశారు. అయితే రవాణా సరుకులపై మాత్రం ఏ మేర ఉండబోతుందనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. పూర్తి వివరాలు తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.