మరిన్ని ఆత్మహత్యలకు ఆజ్యం పోస్తున్నారా?

August 31, 2015 | 10:40 AM | 1 Views
ప్రింట్ కామెంట్
undavalli-ramachandraiah-ap-special-status-suicides-niharonline.jpg

ప్రత్యేక హోదా విషయంలో ప్రభుత్వాల పరిస్థితి ఎలా ఉన్నా... ప్రజల్లో మాత్రం తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ క్రమంలోనే వరుస ఆత్మహత్యలతో ఏపీ లో కలకలం చెలరేగుతోంది. రాను రానూ ఈ సంఖ్య మరింత పెరుగుతున్న ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ రాకపోగా వాటిని నివారించేందుకు చేసే ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. భరోసా కల్పించి అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత ప్రభుత్వాని పైనే ఉంది. ఈ సమయంలో శత్రుత్వం ఉన్నా ప్రజల పక్షాన నిలిచి తమ వంతు సాయం ప్రతిపక్షాలు కూడా చేయాలి. కానీ, వారు చేస్తుందేంటి...?

                            ఓవైపు ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్సీపీ తోపాటు బీజేపీ, కాంగ్రెస్ లు ప్రత్యేకం పై అనవసర రగడను రేకెత్తిస్తున్నాయి.  రాజకీయ ఎత్తుగడలో భాగంగా అధికార పక్షాల (తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ) పై విమర్శలు చేస్తూ లబ్ధి పొందాలని చూస్తున్నాయి. ప్రత్యేకం పై టీడీపీతో బహిరంగ చర్చకు సిద్ధం అని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి సవాలు విసిరితే... మరో నేత ఉండవల్లి తాను కూడా సై అని పిలుపునిచ్చాడు. ఈ విధంగా కాంగ్రెస్ నేతలు ప్రకటనలు చేస్తూ హడావుడి చేస్తున్నారు. ఇదే సమయంలో మండలిలో ప్రతిపక్ష నేత సీ రామచంద్రయ్య హోదా రాకపోతే రాష్ట్రం పరిస్థితి అగమ్యగోచరమే అన్నాడు. ఒకవైపు ఆందోళనతో ఆత్మహత్యల సంఖ్య పెరుగతుంటే... నేతలు ఇలా మాట్లాడటం సరికాదని చెప్పాలి. ప్రభుత్వ పోరాటానికి మద్దతు ప్రకటించకపోయినా సరే... ప్రజల్లో మనోధైర్యం నింపి ఆత్మహత్యలను నివారించేలా చూడాలే తప్ప... అనవసరమైన అంశాలను లేవనెత్తి ఆందోళనను మరింత పెంచొద్దని మనవి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ