అసెంబ్లీ సమావేశాల్లో మైకు దక్కడం అనేది పూర్వజన్మ సుకృతం. స్పీకరు దయాదాక్షిణ్యాలు. గతంలో అధికారంలో ఉన్నవారు ఏం చేశారో, మారిన ప్రభుత్వం తన వంతు వచ్చినప్పుడు బదులు తీర్చుకోనే ఆచారం మనం పరికిస్తున్నాం. మీ నాన్న మాకసలు మైకు ఇచ్చిన పాపాన్న పోలేదు. అదే పోయిందని పుణ్యానికి నీకు మైకు ఇస్తున్నాం అన్నారు బాబుగారు. ఇవ్వనందుకు జగన్ మనస్ఫూర్తిగా బాధపడ్డాడు. అలా బాధపడి ఆ గర్భశత్రు మీడియా ఏబీఎన్ కి ప్రసార కాంట్రాక్టు దఖలు పరిచినందుకు పసుపు బంధం, వగైరాలన్నింటినీ ఏకరువు పెట్టేరు. చంద్రబాబు మాట్లాడినవన్నీ కొన్ని పత్రికలు పతాక శీర్షికల్లో పెట్టినందుకు కూడా వికల మనస్కులయ్యేరు. ఒక పక్క మైకు ప్రహసనం జరుగుతుండగా స్పీకరు మీలోనే ఎవరో వైరు తెంచుకున్నారని, తిరిగి అదే మాట ముక్తాయింపుగా మైకులు మొరాయి నందుకు కారణమనే ప్రకటించేరు. స్పీకరు అబద్ధం ఆడతారా అధ్యక్షా?