ఒకే గాటిన ఈ కారణ జన్ముల్ని ఇద్దరినీ కట్టేస్తే తన్నులు తప్పవు. ఇందులో గాడిద కంటె గుర్రం హోదా ఎక్కువగా భావించడం ఆచారం. కానీ, గాడిద పాలు, రక్తం, మాంసం కొందరు జ్నానులు స్వీకరిస్తూ ఉంటారని వినికిడి.
పిల్లి, ఉమ్మారెడ్డి, ఆదిరెడ్డి ప్రభృతులు షెడ్యూలు కులాలు, ట్రైబల్ విద్యార్థులకు ఆదాయపరిమితి కొలమానం కాకుండా చూడాలి అని విజ్ణప్తి చేశారు. సంబంధిత మంత్రి ఎవరయ్యా అంటే రావెల కిషోర్ బాబు. వెనుకబడిన వర్గానికి చెందినా అధికార దండం ధరించి ముందు వరసనే అలంకరిస్తున్న అమాత్యుడు. వారివారికే మేలు కోరి ప్రశ్నించినప్పటికీ, మంత్రికి విచక్షణ లోపించినదై ఏ సామెత ఏ పరిస్థితిలో ఉపయోగించాలో తెలియక వసుదేవుని పాత్ర పోషించవలసిన ఘోర, దుర్భర అవమాన భారం పాలవ్వాల్సి వచ్చింది. రావెల నిజంగానే వెనుకబడ్డారు.
తెలుగు సామెతలు వాటి అర్థములు అసెంబ్లీ ఆవరణలో లభించే ఏర్పాటు చేస్తే ఉత్తమం.