ఏపీ ప్రత్యేక హోదా సీక్రెట్ బయటపడింది

April 19, 2016 | 05:11 PM | 1 Views
ప్రింట్ కామెంట్
NITI Aayog-AP-special-status-niharonline

నవ్యాంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ప్రకటించాలన్న డిమాండ్ అన్ని పార్టీల నుంచి వినిపిస్తోంది. 14వ ఆర్థిక సంఘం నిబంధనల మేరకు ఏపీకి ప్రత్యేక హోదా అర్హత లేదన్న వాదన అడ్డంకిగా మారింది. ఒకవేళ ప్రత్యేక హోదా డిమాండ్ వదిలేస్తే, నిధులను ఇబ్బడిముబ్బడిగా ఇచ్చేస్తామని కేంద్రం చెబుతూ వస్తోంది. అయితే చాలా వరకు రాష్ట్రాలు ప్రత్యేక హోదా సాధించుకోగా ఒక్క ఆంధ్రప్రదేశ్ విషయంలోనే ఎందుకిలా కండిషన్లు పెడుతున్నారనే విషయం ఇంకా అర్థం కావటం లేదు. అసలు మతలబేమిటో తేల్చేద్దామని రంగంలోకి దిగిన ఏపీకి చెందిన న్యాయవాది శ్రావణ్ కుమార్ నీతి ఆయోగ్ కు సహాచార హక్కు చట్టంతో ఆస్త్రం సంధించారు. సదరు అర్జీకి నీతి ఆయోగ్ స్పందించక తప్పలేదు. దీంతో వాస్తవాలు అన్నీ బయటపడ్డాయి.

                         నీతి ఆయోగ్ వెల్లడించిన వివరాల ప్రకారం... ఏ రాష్ట్రానికైనా ప్రత్యేక హోదా ప్రకటించే అర్హత ఒక్క జాతీయ అభివృద్ధి మండలి(నేషనల్ డెవలప్ మెంట్ కౌన్సిల్-ఎన్డీసీ)కు మాత్రమే ఉంది. గతంలో ప్రత్యేక హోదా ప్రకటించింది, ఇక భవిష్యత్తులో అలాంటి హోదా ప్రకటించే ఒకే ఒక్క సంస్థ ఎన్డీసీనే. రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ప్రకటించేందుకు ఆ సంస్థ ఐదు మార్గదర్శకాలను ప్రాతిపదికగా తీసుకుంటుంది. వాటిలో  కొండ ప్రాంతం,  జన సాంద్రత తక్కువగా ఉన్న ప్రాంతం లేక గిరిజన జనాభా అధికంగా ఉన్న ప్రాంతం, పొరుగు దేశాలతో సరిహద్దు పంచుకునే వ్యూహాత్మక ప్రాంతంలో ఉండటం, ఆర్థికంగా, మౌలిక వసతుల పరంగా వెనుకబడి ఉండటం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడం తదితరాలు ఉన్నాయి. వీటిలో చివరి రెండు మార్గదర్శకాల ప్రకారం ఏపీకి ప్రత్యేక హోదా అర్హత ఉంది. వీటిని పరిగణలోకి తీసుకుని కూడా ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వకపోవటం మోసం చేసినట్లే అవుతుంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ