కమల కురువృద్ధుల హడావుడి ఎందుకోసం?

December 24, 2015 | 02:34 PM | 1 Views
ప్రింట్ కామెంట్
Advani_Joshi_azad_suspension_niharonline

ప్రధాని పీఠానికి నరేంద్ర మోదీ పేరును ప్రతిపాదించిన సమయం దగ్గరి నుంచి అలకబూని పార్టీకి దూరమైన అద్వానీ ఇప్పటిదాకా ఎక్కడా క్రియాశీలక రాజకీయాల్లో కనిపించలేదు. అడపాదడపా పార్టీ మీటింగ్ లకు హాజరైనప్పటికీ అదంతా నామమాత్రంగానే మిగిలింది. దీంతో అద్వానీ ఇక రాజకీయాలకు పూర్తిగా దూరమైనట్లేనా అన్న సందేహాలు వ్యక్తం అయ్యాయి. ఒక్క అద్వానీయే కాదు పార్టీలో ఉన్న కురువృద్దులంతా పార్టీ కార్యకలాపాలకు దూరమై ఏడాదిన్నర అయ్యింది అంటే మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్నమాట.

అయితే ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా బీజేపీ సీనియర్ నేతలంతా తిరిగి సీన్లోకి వచ్చారు. ఢిల్లీలో మురళీ మనోహర్ జోషి నివాసంలో వీరంతా భేటీ అయ్యారు. అగ్రనేత అద్వానీతో పాటు శాంత కుమార్, యశ్వంత్ సిన్హా వంటి సీనియర్లు కూడా ఈ భేటీకి హాజరయ్యారు. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు, పార్లమెంటు సమావేశాలు తదితర అంశాలపై వీరు చర్చిస్తున్నారు. ఢిల్లీ అండ్ డిస్ట్రిక్స్ క్రికెట్ అసోసియేషన్ వ్యవహారం, అరుణ్ జైట్లీపై ఆరోపణలు, సొంత ఎంపీ కీర్తి అజాద్ పై సస్పెన్షన్ అంశాలపై చర్చ జరుపుతున్నారు. అంతేకాదు అరుణ్ జైట్లీని ప్రత్యేకంగా తమ ముందు హాజరై వివరణ ఇచ్చుకోవాలని వారు ఆదేశించారట.  సీరియస్ వ్యవహారాల్లో సైతం ఇన్నాళ్లు కిక్కురుమనకుండా ఉన్న సీనియర్లు మోదీ లేని టైంలో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చి పార్టీ వ్యవహారాలపై మీటింగ్ పెట్టడం సర్వత్రా చర్చనీయాంశమౌతోంది. తమ ప్రాధాన్యత గుర్తించని మోదీ పని పట్టేందుకే ఇలా కమల సీనియర్లంతా ఏకతాటిపైకి వచ్చారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ