మాన్యశ్రీ కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన సింగు, జాతీయ నేర రికార్డుల బ్యూరో వారి నివేదికను సభలో చదివిన సందర్భంగా కొన్ని అసందర్భ ప్రలాపాలకు ఒడిగట్టేరు. సింగుగారి వాచాలతకు హద్దులు లేకపోవడంతో అందరూ ఏకగ్రీవంగా థూ అని ఉమ్మేరు.
ప్రేమించడానికే టైం చాలడం లేదు, ఇక ద్వేషించేందుకు టైమేది? అనేది ఒక మంచి సూక్తి. అలాంటిది నేల దున్నుకోవడానికే టైం కుదరనప్పుడు ప్రేమా దోమ ఎక్కడ అని రైతులు చిన్నిబుచ్చుకుంటున్నారు. సదరు రాధామోహను గారు రైతుల ఆత్మహత్యలకు పంటలు దెబ్బతినడం కాదు. ప్రేమ విఫలం కావడం, రైతుల భార్యలు గర్భధారణకు అనర్హులవడం ఇత్యాది వ్యక్తిగత కారణాలను ఉదాహరించడం జరిగింది. ఈ భగ్నప్రేమ అనే గొప్ప సినిమా మసాలా దినుసు రైతులు వినికూడా ఉండరు. అటువంటి రైతులకు అంటగట్టితే నాగలి తిరగేసి మంత్రిగారిని ఒక్కటిచ్చుకుంటారు. రోగం కుదురుతుంది. వారి బాధలు పరిశీలించి సహయపడకుండా భగ్నప్రేమా లాంటి దురుద్దేశాలు కలిగించి వ్యవసాయం మీద నుంచి దారి మళ్లీంచకుండా ప్రభుత్వం తగు జాగ్రత్త వహించవలెను. ఎందుకో మోదీ టీంలోని చాలా మంది మంత్రులకు మానసిక స్థితి ఆందోళనకరంగానే ఉన్నట్లుంది. పెద్ద సారు బలవంతపు బ్రహ్మచారి... వారిని సంతుష్టిపరచే విధంగా అనుచరగణం ఇలా సాగుతున్నారా?