భూసేకరణ బిల్లుపై చర్చ జరిగిన మొదట్లో హడావుడి చేసిన ప్రముఖ గాంధేయ వాది అన్నా హజారే ఆ తర్వాత సైలెంటయిపోయాడు. దీనిపై తాజాగా విమర్శలు రావటంతో ఆయన మళ్లీ పెదవి విప్పారు. మోదీ ప్రభుత్వం తీసుకున్న భూసేకరణ బిల్లు ప్రజా వ్యతిరేకమని, రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆయన మరోసారి అంటున్నారు. తక్షణమే రైతు వ్యతిరేక నిర్ణయాలను వెనక్కి తీసుకోకుంటే మరోసారి దీక్ష తప్పదని ఆయన హెచ్చరించారు. ప్రధాని మోదీ రైతుల కంటే కార్పోరేటర్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని ఓ ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు. రైతులకు లాభం చేకూరేలా బిల్లులో మార్పులు చేయకుంటే దేశ వ్యాప్తంగా జైల్ భరో లాంటి కార్యక్రమాలనే కాకుండా, గతంలో చేసిన మాదిరిగా ఆమరణ దీక్ష చేపడతానని 77 ఏళ్ల హజారే హెచ్చరించారు. చివర్లో మోదీకి ఆయన పెద్ద చురక అంటించారు. మోదీ కన్నా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అద్బుతంగా పనిచేస్తున్నారని హజారే కితాబిచ్చారు.