ఫేస్ బుక్ లో మహిళా నేతలపై అసభ్య కామెంట్లు

October 19, 2015 | 11:43 AM | 3 Views
ప్రింట్ కామెంట్
cherian philip facebook  comments congress women leaders niharonline

ఎన్ని విమర్శలు చేసుకున్నా... దిగజారి మాట్లాడుకున్నప్పటికీ నేతలు కాస్త వారి వారి పరిధిలో చేసుకుంటే మంచింది. కానీ, ఇక్కడో నేత దిగజారి మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కుంటున్నాడు. ప్రస్తుతం అక్కడ స్థానిక సంస్థ ఎన్నికలు జరుగుతున్నాయి. టికెట్లు దక్కించుకోలేని కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు చొక్కాలు విప్పి అర్థనగ్న ప్రదర్శనలు చేస్తున్నారు. దీనిపై చెరియన్ ఫిలిప్ అనే సీపీఐ నేత ఒకరు ఫేస్ బుక్ లో స్పందించారు.  టికెట్ల కోసం మహిళా కాంగ్రెస్ నేతలు కొందరు పెద్దల వద్ద బట్టలు విప్పారని సీపీఐ నేత ఒకరు చేసిన కామెంట్లు తీవ్ర దుమారం రేపుతున్నాయి. చెరియన్ ఫిలిప్  గతంలో కాంగ్రెస్ లోనే పనిచేసి ఆ మధ్య సీపీఐ తీర్థం పుచ్చుకున్నారు.  కాంగ్రెస్ మాజీ నేత ఏకే ఆంటోనీ ప్రధాన అనుచరుల్లో ఈయన ఒకరు.

తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్టును పెడుతూ, "స్థానిక ఎన్నికల్లో టికెట్లు దక్కించుకోలేక పోయిన కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు చొక్కాలు విప్పి అర్ధనగ్న ప్రదర్శనలు చేశారు. గతంలో నేతల వద్ద ఇదే పని చేసిన కొందరు మహిళా కార్యకర్తలు టికెట్లను పొందారు" అని అన్నారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. పలువురు నేతలు, మహిళా సంఘాలు ఆయన దిష్టి బొమ్మలను దగ్ధం చేసి నిరసనలు తెలిపారు.ఆయనపై చట్ట పరమైన చర్యలు తీసుకోనున్నట్టు మహిళా కాంగ్రెస్ నేతలు బిందుక్రిష్ణ, షనిమోల్ ఉస్మాన్ హెచ్చరించారు.

దీంతో దిగివచ్చిన ఆయన "నేను మహిళలకు వ్యతిరేకంగా ఏమీ మాట్లాడలేదు. నేను ఎప్పుడూ వారిని గౌరవిస్తాను. మహిళలను అవమానిస్తున్న కొందరు నేతల తీరును మాత్రమే వేలెత్తి చూపాను" అని వివరణ ఇచ్చారు. తక్షణం ఆయన తన వ్యాఖ్యలను విరమించుకోవాలని, మహిళలకు క్షమాపణ చెప్పాలని కేరళ పీసీసీ అధ్యక్షుడు వీఎం సుధీరన్ డిమాండ్ చేశారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ