చంద్రబాబు-పవన్ ఫోన్ లో ఏం మాట్లాడుకున్నారు?

October 17, 2015 | 11:48 AM | 3 Views
ప్రింట్ కామెంట్
chandra-babu-pawan-kalyan-amaravathi-invitation-niharonline

నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన ముహుర్తం దగ్గర పడుతుండటంతో ఆహ్వానాలు అందించేందుకు ఏపీ సర్కార్ హడావుడి చేస్తుంది. పలువురు ప్రముఖులకు రావాలంటూ ఏపీ సర్కారు పిలుపు ఊపందుకుంది. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని నేతలను ఆహ్వానించేందుకు ఏపీ మంత్రులు ఇప్పటికే తరలి వెళ్లారు. ఇక నిన్న చెన్నై వెళ్లిన టీడీపీ సీనీయర్ నేత, కేంద్ర మంత్రి సుజనా చౌదరి తమిళనాడు గవర్నర్ రోశయ్యకు ఆహ్వానం పలికారు. మరోవైపు ఆహ్వాన పత్రికలు తీసుకుని ఏపీ మంత్రులు హైదరాబాదు సహా దేశంలో వివిధ ప్రాంతాలకు తరలివెళ్లారు.

             అయితే పదేళ్ల తర్వాత అధికారంలోకి రావటానికి తన వంతు సాయం అందించిన జనసేన అధినేత, నటుడు పవన్ కళ్యాణ్ కు ఆహ్వానం ప్రత్యేకంగా ఉండాలని చంద్రబాబు మంత్రులకు సూచించాడట. ఇందులో భాగంగా ముందుగా శుక్రవారం ఆయన పవన్ కల్యాణ్ కు ఫోన్ చేశారట. అమరావతి శంకుస్థాపనకు తప్పనిసరిగా హాజరు కావాలని ఈ సందర్భంగా పవన్ కు చంద్రబాబు ఆహ్వానం పలికారు. తాను కాస్త బిజీగా ఉన్నందున స్వయంగా రాలేకపోతున్నానని చెప్పగా, పవన్ తాను అర్థం చేసుకోగలను అని చెప్పారట. అంతేకాదు ఆహ్వానంపై పవన్ హాజరవుతానని చెప్పినట్లు సమాచారం.  ఇదిలా ఉంటే, శనివారం ఉదయం ఏపీ మంత్రులు నానక్ రాంగూడలోని రామానాయుడు స్టూడియోలో సర్దార్ షూటింగ్ లో ఉన్న పవన్ కల్యాణ్ కు స్వయంగా ఆహ్వాన పత్రికను అందించనున్నారు. మరి మంత్రుల వద్ద తన రాక గురించి పవన్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ