అవినీతి నిర్మూలన కోసం ‘క్రేజీ’ ఐడియా!

June 02, 2015 | 11:32 AM | 2 Views
ప్రింట్ కామెంట్
arvind_kejriwal_bihar_cops_anti_corruption_bearaue_niharonline

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పాలనలో వైవిధ్యతను ప్రదర్శించాలనుకుంటున్నారేమో అయిన తాజా నిర్ణయం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది.  అవినీతి నిరోధక శాఖ ఆంటీ కరెప్షన్ బ్రాంచ్ పనితీరును మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందుకోసం బీహారుకు చెందిన పోలీసు అధికారులను కేజ్రీవాల్ సర్కార్ పిలిపించుకోంటోంది. ఇప్పటికే ఐదుగురు పోలీసులు ఏసీబీలో చేరినట్టు తెలుస్తోంది. ఇద్దరు సీఐ, ముగ్గురు ఎస్ఐ స్థాయి అధికారులు ఢిల్లీ సర్కారు కిందకు డిప్యూటేషన్ పై వచ్చారు. అంతకుముందు బీహార్ సర్కార్ కు లేఖ రాస్తూ తమకు కొందరు పోలీసు అధికారులను పంపించాలని కేజ్రీ సర్కార్ కోరింది. ఏసీబీ చట్టపరిధి ఏ మేరకు అన్న విషయమై కోర్టులో కేసు నడుస్తున్న నేపథ్యంలో బీజేపీయేతర ముఖ్యమంత్రులు పాలిస్తున్న రాష్ట్రాల సహకారాన్ని తీసుకోవటం ద్వారా కేంద్రంపై రాజకీయ ఒత్తిడి పెంచాలన్నది కేజ్రీ సర్కార్ ఆలోచనగా తెలుస్తోంది. కాగా, ఈ నిర్ణయంతో లెఫ్టినెంట్ తో వివాదం మరింత ముదరవచ్చుననే సంకేతాలు అందుతున్నాయి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ