రేవంత్ రెడ్డికి ఫైర్ బ్రాండ్ అనే పేరుంది. ప్రత్యర్ధులను తన మాటలతో చిత్తు చేయగలిగే సత్తా ఉంది. అయితేనేం, ఎమ్మెల్సీ ఎన్నికల్లో నోటుకు ఓటు వ్యవహారంకి పాల్పడి రెడ్ హ్యాండెడ్ గా దొరికి, అడ్డంగా బుక్కయి అరెస్టయ్యారు. తమ పార్టీ (టీడీపీ) అభ్యర్థికి ఓటు వేయాలని కోరుతూ నిన్న(ఆదివారం) ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రూ.50 లక్షలు ఇస్తుండగా రేవంత్‌రెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే జడ్జి కాస్త ఉదారత చూపటంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయడానికి రేవంత్ కు అనుమతి దొరికింది. ముందుగా సోమవారం ఉదయం రేవంత్ రెడ్డిని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. రేవంత్ కు జడ్జి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించారు. అనంతరం ఓటు వేసేందుకు అనుమతించాలని రేవంత్ తరపున లాయర్లు కోరటంతో అనుమతి దొరికింది. అయితే పోలీసుల వీలును బట్టి ఇదంతా జరగాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఇక దీనిని ఆయన అసరాగా తీసుకుని అసెంబ్లీ దగ్గర పిచ్చ టైంపాస్ చేస్తున్నారు. ముందుగా అసెంబ్లీ వద్దకు చేరుకున్న ఆయనకు టీడీపీ నేతలు ఆలింగనం చేసుకుని సాదరంగా ఆహ్వానం పలికారు. ఆ తర్వాత వారితో కబుర్లు చెప్పుకుంటూ రేవంత్ సమయాన్ని వృథా చేస్తువస్తున్నారు. ఓటు వేసిన వెంటనే చర్లపల్లి జైలుకు తరలిస్తారని అనుమానంతో ఓటు హక్కు వినియోగించుకోలేదని తెలుస్తోంది. మరో వైపు బెయిల్ పిటిషన్ కోరుతూ రేవంత్ రెడ్డి తరపు న్యాయవాది కోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు. స్పందించిన కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీని ఆదేశించింది. ఏదేమైనా రేవంత్ వ్యవహార శైలి చూస్తూంటే అరెస్టయిన యమ లైట్ గా తీసుకుంటున్నట్టున్నారు.