ప్రధానిని కలిసిన సామాన్యుడు

February 12, 2015 | 12:43 PM | 20 Views
ప్రింట్ కామెంట్
kejriwal_meets_modi_niharonline

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ గురువారం ప్రధాని మోదీని కలిశారు. తన అనుచరుడు మనీష్ సిసోడియాతో కలిసి ప్రధాని నివాసానికి వెళ్లి భేటీ అయ్యారు. ఢిల్లీ కి రాష్ట్ర హోదా కల్పించే అంశంపై ఈ సందర్భంగా ఆయన ప్రధానికి వివరించినట్లు సమాచారం. దీనికి ప్రధాని కూడా సానుకూలంగా స్పందించాడని, ఢిల్లీకి అవసరమైన కేంద్ర సాయం తప్పకుండా అందిస్తామని హామీ ఇచ్చాడని సమావేశం అనంతరం సిసోడియా మీడియాతో చెప్పారు. ఇదే సమయంలో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా మోదీని కేజ్రీవాల్ ఆహ్వానించారట. అయితే అదే సమయంలో మహారాష్ట్రలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నిర్వహించే ఓ కార్యక్రమం ఉన్నందున హాజరుకాలేనని మోదీ కేజ్రీవాల్ తో చెప్పినట్లు సమాచారం. ఇక కేజ్రీవాల్ అనుచరుడు మనీష్ సిసోడియా ఢిల్లీ ఉపముఖ్యమంత్రి పీఠం అధిరోహిస్తారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు ఇంకో ఆప్ నేత కుమార్ విశ్వాస్ తమ యుద్ధం అవినీతిపైనే కాని, మోదీ మీద కాదని చెప్పారు. మోదీ వ్యతిరేక కూటములతో కలుస్తారా అన్న ప్రశ్నకు... అలా చేయబోమని సమాధానమిచ్చారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ