సెక్స్ రాకెట్ ఉందని బాంబు పేల్చాడు

December 29, 2015 | 05:18 PM | 2 Views
ప్రింట్ కామెంట్
kejriwal-DDCA-scam-sex-scam-niharonline

డీడీసీఏ (ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ కార్పొరేషన్ అసోసియేషన్) వ్యవహారంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణ చేశారు. ఆర్థిక కుంభకోణంగా భయటపడినప్పటికీ ఇందులో సెక్స్ రాకెట్ కూడా దాగి ఉందని బాంబు పేల్చారు. క్రికెటర్ల ఎంపికలో భాగంగా.. కుమారుడిని క్రికెట్ టీమ్ లోకి తీసుకోవాలని డీడీసీఏను కోరితే తన భార్యను శారీరక సుఖం కోసం పంపాలని ఓ అధికారి అడిగినట్టు ఓ సీనియర్ జర్నలిస్ట్ తనతో చెప్పి వాపోయారని కేజ్రీ వెల్లడించారు. అయితే ఆ అధికారి ఎవరు, ఆ జర్నలిస్ట్ ఎవరన్న విషయాన్ని మాత్రం చెప్పాలనుకోవడం లేదని అన్నారు. డీడీసీఏ స్కాంపై ఎవరు విచారణ చేసినా కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ పరువుకు భంగం వాటిల్లుతుందని చెప్పారు.

                          ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకోరని కూడా తాను భావిస్తున్నానని కేజ్రీ చెప్పుకోచ్చాడు. ఎందుకంటే మా ప్రభుత్వం కొలువుదీరాక  మోదీని కలిసిన టైంలో మేము (ఆప్ ప్రభుత్వం) మీ పిల్లలాంటి వాళ్లం. మాకు మార్గనిర్దేశకం చేయండి అని కోరాం. ఆయన మౌనం వహించారు. దానిని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆయనకి మాపై ఎలాంటి అభిప్రాయం ఉందో అని కేజ్రీవాల్ వివరించారు. సీబీఐకి తాను భయపడబోనన్న కేజ్రీ, తనపైనా తర్యాప్తు చేసుకోవాలని సవాల్ చేశారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ