ఆ నేత దేశం పరువు బజారుకీడ్చారట

October 06, 2015 | 05:23 PM | 2 Views
ప్రింట్ కామెంట్
Asaduddin_Owaisi_ajam_khan_niharonline

ఎంత భిన్నత్వంలో ఏకత్వం ఉన్నా కొంత మంది మత చాంధస్సుల మూలంగా మనదేశంలో మతకలహాలు చెలరేగుతున్నాయి. ముఖ్యంగా ఆ రెండు మతాల మధ్యే ఈ చిచ్చు ఎక్కువగా రగులుతూ ఉందనటంలో ఎలాంటి సందేహం లేదు. ముజఫర్ నగర్ అల్లర్లు, దాద్రి ఘటనలే దీనికి తార్కాణం. ముస్లింలపై తరచు దాడి జరగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై అధికార పక్షనేతలెవ్వరూ స్పందించటం లేదని విషయం కూడా తెలిసిందే. సున్నితమైన అంశమైనందునే ప్రధాని మోదీ లాంటి వారు సైతం మిన్నకున్నారు.

భారతదేశంలో ముస్లింల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ యూపీ సమాజ్ వాదీ పార్టీ నేత అజంఖాన్ ఐక్యరాజ్యసమితికి లేఖ రాశాడు. ఇక దానిపై ఎంఐఎం పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యను దేశంలోనే పరిష్కరించుకునే పరిస్థితి ఉన్నా ఐరాస దృష్టికి ఎందుకు తీసుకెళ్లారని ఢిల్లీలో ప్రశ్నించారు. అజం చర్య ప్రమాదకరమైందన్నారు. అనవసరంగా దేశ ప్రతిష్టను బజారుకీడ్చారని ఆగ్రహాం వ్యక్తంచేశారు. అసలు తప్పంతా యూపీ ప్రభుత్వానిదేనని ఆరోపించారు. ముస్లింలకు భద్రత కల్పించలేకపోతున్న సీఎం అఖిలేష్ ప్రభుత్వ అసమర్థత వల్లే ఇదంతా జరిగిందని విమర్శించారు. త్వరలో ఎన్నికల ద్వారా మజ్లిస్ హవా చూపి తమ సత్తా చాటుతారని ఒవైసీ తెలిపాడు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ