మాజీ గవర్నర్ అజీజ్ ఖురేషీ చేసిన వ్యాఖ్యలు మోదీ ప్రభుత్వం నెత్తిన మరో బాంబు వేశారు. ఆయన ప్రస్తుతం చేసిన వ్యాఖ్యలు కేంద్రాన్ని తీవ్ర ఇరకాటంలో పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంతకీ ఆయనేమన్నారంటే... ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలను బర్తరఫ్ చేయాల్సిందిగా కొందరు పెద్ద వ్యక్తులు తనపై ఒత్తిడి తెచ్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ తాను ఆ పని చేయలేదని ఆయన తెలిపారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ రెండు ప్రభుత్వాలు తన అధీనంలో ఉన్నాయని, ఈ రెండు ప్రభుత్వాలు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయ్యాయని గుర్తు చేశారు. అయితే, ఈ రెండు ప్రభుత్వాలను కూల్చాలని కొందరు వ్యక్తులు తనపై ఒత్తిడి చేశారన్నారు. కానీ తాను నిజాయతీ వైపే నిలబడాలని నిర్ణయించుకున్న ఆ ప్రభుత్వాలను బర్తరఫ్ చేయలేదని గుర్తు చేశారు. అందువల్లే తాను గవర్నర్ పదవిని కోల్పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాకాకుండా తనపై ఒత్తిడి తెచ్చిన వ్యక్తుల మాట విని ఉంటే, ఇప్పటికీ గవర్నర్ పదవిలోనే ఉండేవాడినని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, గవర్నర్ పదవి నుంచి దిగిపోయే సమయంలో ఆయన నరేంద్ర మోడీ సర్కారును ముప్పుతిప్పలు పెట్టారు.