అగ్గిపెట్టె... అశోకగజపతిరాజు... అనవసర రాద్దాంతం

April 08, 2015 | 01:07 PM | 48 Views
ప్రింట్ కామెంట్
Ashok_Gajapathi_Raju_match_box_niharonline

తాను విమానం ఎక్కినప్పుడల్లా అగ్గిపెట్టె తీసుకువెళ్తుంటానని, అలాగని దాంతో విమానం హైజాక్ చేసే వీలుంటుందా? అంటూ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దానిపై మీడియాలో పలురకాలుగా వార్తలు రావటంతో మంత్రి స్పందించారు. అగ్గిపెట్టె వివాదంపై అనవసరం రాద్ధాంతం చేస్తున్నారన్నారు. తన అభిప్రాయాన్ని వక్రీకరించడం సరికాదని, కేంద్ర మంత్రులను కూడా తనిఖీ చేయాలన్నది తన ఉద్దేశమని పేర్కొన్నారు. విమాన ప్రయాణికుల భద్రతపై అమెరికా ప్రతినిధితో చర్చించామని భద్రత కేటగిరీ 2 నుంచి 1 కి చేరటం శుభపరిణామమన్నారు. ఇక సందర్భంగా ఆయన ఏపీ లో ఎయిర్ పోర్టుల విస్తరణపై మీడియాకు వివరించారు. అలాగే కొత్త రాజధాని అమరావతిలో ఎయిర్ పోర్ట్ మాస్టర్ ప్లాన్ తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ