బీజేపీ రెబల్ నేత హింట్ ఇచ్చాడా?

January 06, 2016 | 05:23 PM | 1 Views
ప్రింట్ కామెంట్
BJP MLA Rajasingh Thakur hints to Joins in TRS niharonline

గ్రేటర్‌ వెలుపల ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలోనూ ప్రాతినిధ్యం లేకపోవడంతోపాటు.  మెదక్‌, వరంగల్ పార్లమెంటు ఉపఎన్నికలో  ఘోరాతిఘోరంగా ఓడిపోవడంతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చూపించాల్సిన తప్పనిసరి పరిస్థితి బీజేపీకి ఏర్పడింది. టీడీపీతో సీట్ల సర్దుబాటు దగ్గరి నుంచి పార్టీ కోటాలో దక్కే సీట్లలో సరైన అభ్యర్థులను ఎంపిక చేసే వరకూ విజయావకాశాలను దృష్టిలో పెట్టుకునే వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడటంతో పార్టీలో ప్రస్తుతం అసంతృప్తి వాతావరణం నెలకొంది.

వాస్తవానికి పార్టీపై గ్రేటర్‌ నేతలు, వారి అస్మదీయులే పెత్తనం కొనసాగిస్తున్నారంటూ జిల్లాల నాయకత్వం ఇప్పటికే అసంతృప్తితో ఉంది. ఇటీవల బీజేపీ రెబల్ నేతగా మారిన ఆ పార్టీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తాజాగా మరిన్ని ఆరోపణలు చేశారు. తెలంగాణ బీజేపీలో గ్రూప్ రాజకీయాలు పెరిగాయని అన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఈ గ్రూపులను పెంచి పోషిస్తున్నారని ఆరోపించారు. గ్రూప్ లను కట్టడి చేసే ప్రయత్నం కూడా జరగడం లేదని, ప్రతి డివిజన్ లో నాలుగేసి గ్రూప్ లు తయారయ్యాయని మీడియాతో మాట్లాడుతూ అన్నారు. తన అనుచరులకు టికెట్లు ఇవ్వకుంటే హిందూవాదం పేరుతో పోటీ చేయిస్తానని రాజాసింగ్ స్పష్టం చేశారు. ఈ విషయంపై శివసేన, హిందుత్వ పార్టీలతో మాట్లాడుతున్నామని తెలిపారు.

రాజాసింగ్ పార్టీ మారి కారెక్కుతారంటూ ఆ మధ్య వార్తలు వచ్చిన నేపథ్యంలో తాజా వ్యాఖ్యాలు దానికి మరింత మద్ధతు చేకూరుస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో  ఒకవేళ ఆయన తన అనుచరులతో సహా ఎన్నికల ముందే మారినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనిపిస్తోంది. మొత్తానికి గ్రేటర్‌ అంశం ప్రస్తుతానికి బీజేపీకి పెద్ద తలనొప్పిగా మారింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ