కొత్త రాజుగారి కితకితలు

March 27, 2015 | 02:07 PM | 201 Views
ప్రింట్ కామెంట్
vishukumar_jagan_niharonline

ఏపీ అసెంబ్లీలో స్పీకర్ కోడెల శివప్రసాద్ పై విపక్ష సభ్యుల పరుష పదజాలంతో హెచ్చరికలు, ఎనిమిది మంది సభ్యుల సస్పెన్షన్, కొంతమందిపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు... ప్రతిగా స్పీకర్ పై వైసీపీ అవిశ్వాస తీర్మానం తదితరాలతో నిన్నటిదాకా సభా సమావేశాలు వాడివేడిగా జరిగాయి. అయితే చివరిరోజు సమావేశాలు ప్రశాంత వాతావరణంలో సాగుతున్నాయి. దీనికంతటికి కారణమేంటో తెలుసా? కొత్త సభ్యుడినంటూ సభలో నిత్యం నవ్వులు పూయిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు.  అధికార, విపక్షాల మధ్య రాజుకున్న వేడిపై నీళ్లు చల్లి చల్లబరచిన ఆయన స్పీకర్ పై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానాన్ని ఉపసంహరించుకునేలా వైసీపీలో పునరాలోచన తెచ్చారు. విష్ణుకుమార్ రాజు మధ్యవర్తిత్వం నేపథ్యంలో వైసీపీ సభ్యులపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసుల జారీని అధికార పక్షం దాదాపుగా విరమించుకుంది. అదే సమయంలో కోడెలపై ఇప్పటికే అసెంబ్లీ కార్యదర్శికి అందించిన అవిశ్వాస తీర్మానాన్ని వెనక్కు తీసుకునే దిశగా వైసీపీ ప్రయత్నిస్తోంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ