బ్లాక్ మెయిల్ దిగి మరీ పంతం నెగ్గించుకున్న రాహుల్

March 27, 2015 | 11:18 AM | 93 Views
ప్రింట్ కామెంట్
Rahul_Gandhi_on_internal_cong_election_niharonline

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మొండి మనిషి. తన పంతం నెగ్గించుకునేదాకా తగ్గే మనిషే కాదు. గతంలో యూపీఏ-2 హయాంలో నేరచరితులైన నేతలను రక్షించే విధంగా ఉన్న ఆర్డినెన్స్ ను పట్టుబట్టి విరమింపజేసిన విషయం తెలిసిందే. అలాగే ఇప్పుడు మరో డిమాండ్ తో ఆయన అధిష్ఠానాన్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టారట.  పార్టీలోని అన్ని స్థాయిల్లో సంస్థాగత ఎన్నికలు జరగాల్సిందేనని పట్టుబడుతున్న ఆయన, అందుకు పార్టీ అధిష్ఠానం ససేమిరా అనడంతోనే సెలవుపై వెళ్లి ఎంతకీ తిరిగిరావట్లేదట. బడ్జెట్ సమావేశాలకు డుమ్మాకొట్టి మరీ సెలవుపై వెళ్లిన రాహుల్ గాంధీ, సెలవు గడువు ముగిసినా ఆయన జాడలేదు. వచ్చాక మాట్లాడుకుందామన్న ఆఫర్ ను ఆయన తిరస్కరించారట. సంస్థాగత ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటిస్తే కానీ తిరిగివచ్చేది లేదని రాహుల్ తేల్చి చెప్పారట. దీంతో అధిష్ఠానం దిగొచ్చింది. మే 15 నుంచి సెప్టెంబర్ 30లోగా సంస్థాగత ఎన్నికలను నిర్వహించనున్నట్లు పార్టీ ప్రకటించింది. దీంతో శాంతించిన రాహుల్ గాంధీ అజ్ణాతాన్ని వీడేందుకు సమ్మతించారు. వచ్చే వారంతో ఆయన ఢిల్లీలో వాలిపోతారట. వచ్చిరాగానే పార్టీ పగ్గాలు చేపట్టేందుకు ఆయన ఉవ్విళ్లూరుతున్నట్లు పార్టీ వర్గాలు గుసగుసలు వినిపిస్తున్నాయి.  

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ