భారీ కుంభకోణంలో మీడియాను మేనేజ్ చేశారా?

April 29, 2016 | 01:22 PM | 1 Views
ప్రింట్ కామెంట్
augusta-scam-media-involvement-bribe-50-crores-niharonline

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో పాటు ఆ పార్టీ పెద్ద తలకాయలను ఇరుకున పడేసిన అగస్టా వెస్ట్ ల్యాండ్ కుంభకోణం ప్రస్తుతం పార్లమెంట్ ను కుదిపి వేస్తున్న సంగతి తెలిసిందే. యూనివర్సిటీల సమస్యలతో గత బడ్జెట్ సెషన్స్ ను జరగనీయకుండా చేసిన కాంగ్ పై బీజేపీ ప్రస్తుత సమావేశాల్లో ఎదురు దాడికి దిగింది. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ మోదీ సర్కార్ ప్రతిపక్షంపై విమర్శలకు దిగుతోంది. ఈ క్రమంలో భారత మీడియాకూ ఆగస్టా మకిలి అంటిందట. లోక్ సభలో బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖీ ఈ సంచలన ఆరోపణ చేశారు. భారత్ కు తన హెలికాప్టర్లను అంటగట్టేందుకు అగస్టా వెస్ట్ ల్యాండ్ రాజకీయ నేతలతో పాటు మీడియాను మచ్చిక చేసుకునేందుకు భారీగానే ధనాన్ని వెచ్చించిందని మీనాక్షి ఆరోపించారు. ఈ కుంభకోణంలో మధ్వవర్తిగా వ్యవహరించిన క్రిస్టియన్ మైఖేల్... మీడియాను మేనేజ్ చేసేందుకు ఏకంగా రూ.50 కోట్ల మేర ఖర్చు చేసినట్లు లేఖీ ఆరోపించారు. అవినీతిపై సమరం చేయాల్సిన మీడియానే ఈ తరహా కార్యకలాపాలకు పాల్పడటం దురదృష్టకరమని లేఖీ ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా, లేఖల ద్వారా విరుచుకుపడే సుబ్రహ్మాణ్మస్వామి రాజ్యసభలో అడుగుపెట్టగానే కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. అగస్టా నుంచి తీసుకున్న ముడుపులను సోనియా గాంధీ... జెనీవాలోని ‘సరసిన్ బ్యాంక్’లో దాచుకున్నారని స్వామి చెప్పారు. ఇందులో కొంత మొత్తాన్ని అక్కడి నుంచి తరలించిన సోనియా గాంధీ... ‘పిక్ టెట్ బ్యాంకు’లో డిపాజిట్ చేశారన్నారు. ఈ రెండు బ్యాంకుల ఖాతాలను పరిశీలించి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోనియా గాంధీపై కేసులు నమోదు చేయాలని స్వామి డిమాండ్ చేశారు. అంతేకాదు లేఖి చెప్పినట్లు మీడియాకు అందిన ముడుపులు అందులోంచి ఇచ్చారని ఆయన ధృవీకరించారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ