టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు తనయుడు నారా లోకేష్ రాష్ట్ర ప్రత్యక్ష రాజకీయాల ఎంట్రీకి చెక్ పడింది. ప్రస్తుతం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న లోకేష్ త్వరలో మంత్రివర్గంలో చేరబోతున్నారని వార్తలు వినిపించాయి. ఇందుకోసం ఏదైనా ఒక స్థానానికి రాజీనామా చేయించి మరీ ఎన్నికల్లో దిగుతారని పార్టీ వర్గాలు అంచనావేశాయి. అయితే అదంతా హుళక్కే అని తేలింది. ఎందుకంటే ఇప్పుడప్పుడే మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టడం లేదట. ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగడంతో పాటు మంత్రి పదవి చేపట్టేందుకు టైం కావాలని అడుతున్నాడు.
గురువారం విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో స్వయంగా లోకేష్ ఈ విషయాన్ని తెలియజేశాడు. అయితే 2019లో జరిగే ఎన్నికల బరిలోకి దిగేందుకు రెడీ అవుతున్నానని, ఆ తర్వాత కేబినెట్ లో చేరేందుకు సిద్ధమవుతున్నానని కూడా లోకేశ్ ప్రకటించారు. మొత్తానికి రాష్ట్ర రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తానని చెబుతూ సీఎం రేసులో ఉన్నట్లు చెప్పకనే చెప్పాడు. ఏదైతేనేం రాజీనామా టెన్షన్ పెట్టుకున్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు చిన్నబాబు స్టేట్ మెంట్ తో కాస్త ఊరట లభించింది.