స్కాంలు, సెక్స్ స్కాండల్ లు బయట పడిన భక్తులు పూజలు మానరు. బాబాలు ఫోజులు మానరు. వారి గురించి వచ్చిన ఆరోపణలు బయటికి వచ్చినప్పటికీ వెన్నుదన్నుగా నిలవటం రాజకీయ నాయకులకు కూడా కొత్తేం కాదు. రాధే మా గురించి ఇటీవల వార్తలు ఏ రేంజ్ లో బయటికి వచ్చాయో మనందరికీ తెలుసు. భక్తులతో కలిసి ఆ మాతాజీ బాలీవుడ్ పాటలకు స్టెప్పులేస్తుంది. మోడ్రన్ డ్రెస్సులేస్తుంది. పోర్న్ స్టార్ సన్నీ లియాన్ ను తాను ఫూజిస్తుంది.. అయితేనేం ఆమె ఓ స్పెషల్ వ్యక్తి అని అంటున్నారు ఓ రాజకీయ నేత. ఆయనేవరో కాదు సామాజిక న్యాయం సాధారికాత మంత్రి విజయ్ సంప్లా. వివాదాస్పద వ్యక్తుల విషయంలో హద్దులు మీరి తమకున్న భక్తిశ్రద్ధల గురించి చెప్పుకోవటానికి రాజకీయ నేతలకు ఇంతకు మించిన దురదృష్టం ఇంకోటి ఉండదేమో.
గృహహింస కేసులు మొదలు.. పలువురి ఆస్తుల్ని బలవంతంగా తీసేసుకున్నారన్న ఆరోపణలు ఆమెపై ఉన్నాయి. అలాంటి వివాదాస్పద వ్యక్తికి కేంద్రమంత్రి విజయ్ సంప్లా తన మద్ధతును బహిరంగంగా ప్రకటించడం తీవ్ర విమర్శలకు తావునిస్తుంది.. భక్తులతోకలిసి బాలీవుడ్ గీతాలకు డ్యాన్సులు వేయటం.. పొట్టి పొట్టి డ్రెస్సులతో.. ఇష్టారాజ్యంగా ఫోటోలు దిగే అధ్యాత్మికవేత్తగా చెప్పుకునే రాధేమా తీరుపై పలువురు విమర్శలు చేస్తుంటారు. అయితే.. సంప్లా మాత్రం ఆమెను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. తాను రాధేమాను గౌరవిస్తారని.. ఆమెకున్న దివ్యశక్తులతో తాను ఆమె భక్తుడిగా మారిపోయానని చెప్పుకొచ్చారు. అంతేకాదు ఆయనగారు తన ఇంట్లో ఆమె ‘భజన’ కూడా ఏర్పాటు చేశారట. రాధేమా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్ సభ నియోజకవర్గంలో ఓటరు కావటం తన అదృష్టంగా సాంప్ల చెప్పుకుంటున్నారు.? దేశంలో అత్యున్నత స్థానాల్లో ఉన్న ఇలాంటి వ్యక్తులు స్వామీజీలు... బాబాల పట్ల అతి భక్తిని ప్రదర్శించి.. వారికి మద్దతుగా ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడి... విమర్శలు మూటగట్టుకోవటం కొత్తేంకాదులేండి.