కేసీఆర్ గారు నన్ను పిలిచి చంద్రబాబు జేబులో పెన్ను తీసుకొచ్చిస్తే విద్యాశాఖ మంత్రిని చేస్తానన్నాడు... చంద్రబాబు నేనూ బాహుబలి చూస్తున్న టైంలో కేసీఆర్ చేతికి ఉన్న ఉంగరం తెచ్చి ఇస్తే నాకు హోం మంత్రి పదవి ఇస్తానన్నాడు... ఇలాంటి స్టేట్ మెంట్స్ కి రుజువులు, సాక్ష్యలేముంటాయి చెప్పండి. వాక్సాతంత్ర్యం ఉంది. మనిష్టం ఎప్పుడో ఖర్మగాలితే తాడే పామై కరుస్తుంది.
టీఆర్ఎస్ నాయకులు నా గడ్డం పట్టుకుని మంత్రి పదవి ఆఫర్ చేసినా ఎల్లెల్లెండహే అన్నానని శ్రీ ఎర్రబెల్లి ఒక దేవ రహస్యం వెల్లడించారు. ఆ విధంగా ఛీ కొట్టిన పదవిలో కడియం కూర్చుంటున్నాడని అని కూడ ప్రకటించారు. గతంలో మేమందరం టీడీపీలో ఉన్నప్పుడు తన పుణ్యమా అని కడియం రెండు సార్లు మంత్రి అవ్వగలిగేడు అని కూడ వెల్లడిచేశారు. ఇదంతా ఒక ఎత్తు, దయాకర్ అనబడే నేను మంత్రి వేషం కట్టాలంటే క్షణం పట్టదని నమ్మకంగా చెప్పేరు. గోడదూకి టీఆర్ఎస్ లో సంపాదించే మంత్రి పదవా లేక తెలంగాణలో టీడీపీని, రేపే గెలిపించి మంత్రి అనిపించుకోవడమా తెలియజెప్పాలి. మరో స్టేటు మెంటు చూద్దాం. కేసీఆర్ కి టీడీపీ అంటే భయం అన్నారు. ఆకారణంగానే తెలుగు నేతలను జైలుకు పంపి వేధిస్తున్నాడని కూడా ఆవేశంగా చెప్పేరు దొరవారు. భయం ఉంటే భయపడాలి గానీ జైలుకి పంపించే కాన్సెప్ట్ ఏంటి అర్థమయి చావడం లేదు. దీన్ని కొంచెం బాగా చదువుకొన్నవారు స్వవచనా వ్యాఘాతం అని పిలుస్తారు.