కమల‘నాథుల’పై సొంత సీనియర్ నేత చురకలు

May 02, 2015 | 12:20 PM | 115 Views
ప్రింట్ కామెంట్
arun_shourie_slams_BJP_leaders_modi_niharonline

ప్రముఖ జర్నలిస్టు, కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత అరుణ్ శౌరీ తన సొంత పార్టీపైనే విమర్శలు గుప్పించారు. బీజేపీ ముగ్గురు వ్యక్తుల చేతుల్లో బందీగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీతో సహా , పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీల చేతుల్లో పార్టీ చిక్కుకుపోయిందని ఆయన నిన్న వ్యాఖ్యానించారు. ఈ ముగ్గురు నేతల దెబ్బకు పార్టీ నేతలు బెంబేలెత్తిపోతున్నారు. ఇక మోదీ అభివృద్ధి మంత్రంపైనా శౌరీ విమర్శలు సంధించారు. మోదీ చెబుతున్న మాటలన్నీ ఊకదంపుడు ఉపన్యాసాలేనని, ఆయన అన్నారు. పత్రికల్లో ప్రధాన శీర్షికలను అలంకరించటమే ఆ ప్రసంగాల లక్ష్యమని మరింత ఘాటుగా స్పందించారు. భారత ఆర్థిక వ్యవస్థ నిర్వహాణలో మోదీ ఘోరంగా విఫలమవుతున్నారని ఆయన ఆరోపించారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ