ప్రధాని పరువుకు, పతాంజలి మందుకు ముడిపెడుతున్నారట

May 01, 2015 | 04:30 PM | 136 Views
ప్రింట్ కామెంట్
modi_baba_ramdev_divya_putra_jeevak_niharonline

పుత్ర జీవక్ ఓ నాలుగైదు నెలల క్రితం హర్యానాలో బాగా నానిన పేరు. ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా పతాంజలి పీఠం ద్వారా పంపిణీ కాబడిన మందు. ఇది వాడితే మగపిల్లలు ఖచ్ఛితంగా పుడతారని అప్పట్లో తీవ్ర వదంతులు వ్యాపించి వార్తల్లో కెక్కింది. అయితే ఈ పుత్రజీవక్ పై తాజాగా పెద్దల సభలో (రాజ్యసభ)  లో తీవ్ర దుమారం రేగింది. దీంతో రాందేవ్ బాబా నష్టనివారణ చర్యలకు దిగారు. కాంగ్రెస్ నేతలు మోదీ ని టార్గెట్ చేసి బజారుకీడ్చేందుకు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని చెప్పారు. అసలు పుత్రజీవక్ ఔషదం తీసుకుంటే మగబిడ్డే పుడతాడని తానెప్పుడూ చెప్పలేదని బాబా స్పష్టం చేశారు. అయినా పుత్రజీవక్ అనేది కేవలం వృక్షజాతి పేరు మాత్రమేనని, ఆపేరుకు మగబిడ్డ పుట్టడానికి సంబంధం లేదని ఆయన వివరణ ఇచ్చారు. కాగా, తాజాగా పుత్రజీవక్ ఔషధాన్ని నిషేధించాలని కాంగ్రెస్ ఎంపీ త్యాగి రాజ్యసభలో డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని రాందేవ్ ప్రస్తావిస్తూ... తక్షణమే ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అయినా దీనికి ప్రధాని మోదీకి ఏం సంబంధం... నిషేధించాలని పట్టుబట్టడం వారి వంతు... అనవసర చర్చ అని కొట్టిపారేయడం కేంద్ర ప్రభుత్వం వంతు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ