ఎన్ని చట్టాలు చేసిన దేశంలో ఆడవాళ్లపై జరిగే అఘాయిత్యాలను అదుపుకావట్లేదన్నది ఒప్పుకోవాల్సిన నిజం. మరీ వీటికి నియంత్రించగలిగే మార్గం ఉందా? అసలు పరిష్కారం ఎలా?. దీనికి బీజేపీ సీనియర్ నేత మురళి మనోహార్ జోషి ఓ ఉపాయం చెబుతున్నారు. సగటు మనిషి జీవితంలోకి యోగా గనుక ప్రవేశించినట్లయితే, దేశంలో జరిగే ఆడవాళ్లపై జరిగే అఘాయిత్యాలు ఆటోమేటిక్ గా తగ్గుతాయంటున్నారు జోషి . సగటు మనిషి జీవితంలోకి యోగా ప్రవేశిస్తే నిత్యం ఆడవారిపై జరిగే లైంగికదాడులను పూర్తిగా అదుపు చేయలేనప్పటికీ, నియంత్రించవచ్చు. యోగా అనేది మగ, ఆడ లలో ఆలోచన శక్తిని నియంత్రిస్తుంది. అంతేకాదు ఎవరి పనిలో వారు నిమగ్నమయి అలాంటి ఆలోచనలు అసలు దరిచేరవు అంటూ ది అయ్యంగార్ వే... యోగా ఫర్ ది న్యూమిలినియం పేరిట ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన వ్యాఖ్యనించారు. యోగా అనేది మానసికంగానే కాదు... శారీరకంగా కూడా అవసరాలను మార్చేస్తుందని జోషి చెప్పారు. ముస్లిం లు రోజూ ఐదు సార్లు (నమాజ్) యోగా చేస్తారని, మహ్మద్ ప్రవక్త గొప్ప యోగి అని ఆయన కొనియాడారు. అమెరికా లోని ఓ ప్రముఖ యూనివర్సిటీ వైన్స్ చాన్సలర్ నిర్వహించిన సర్వేలో ఈ విషయం శాస్త్రీయ పద్ధతిలో తేలిందని ఆయన వివరించారు.