సూటుకే కాదు మాటలకు అంత గిరాకీ ఉంది మరీ

February 21, 2015 | 02:50 PM | 36 Views
ప్రింట్ కామెంట్
Modi_mann_ki_baat_ad_niharonline

దేశ ప్రధాని నరేంద్ర మోదీ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ధరించిన ప్రత్యేక సూటు ఏ రేంజ్ లో అమ్ముడు పోయిందో తెలిందే కదా. రూ.10 లక్షల విలువైన ఆ సూటు దాదాపు రూ.4.30 కోట్లకు అమ్ముడు పోయి సెన్సెషన్ క్రియేట్ చేసింది. అయితే ఇక్కడ మరో రికార్డును ఆయన క్రియేట్ చేశారండీ. దేశ ప్రజలకు చేరువయ్యేందుకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఎంచుకున్న సులువైన మాధ్యమం రేడియో. మన్ కీ బాత్ అనే కార్యక్రమం ద్వారా నెలలో ఏదో ఒక ఆదివారం ఆల్ ఇండియా రేడియో లో ఆయన దేశ ప్రజలతో నేరుగా సంభాషిస్తున్న సంగతి తెలిసిందే. మెజారిటీ ప్రజలు వింటున్న ఈ ప్రోగ్రాం ద్వారా ఆల్ ఇండియా రేడియోకు కూడా అదే స్థాయిలో ఆదాయం సమకూరుతుందట. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటిదాకా దాదాపు పాతిక లక్షల రూపాలయలు ఆర్జించిందని అంచనా. ఇక ఈ నేపథ్యంలో ఇందులో వాణిజ్య ప్రకటనలు వేసేందుకు గ్రీన్ సిగ్నల్ లభించిందట. దీంతో ఇకపై మధ్యలో యాడ్ లను ఇచ్చేందుకు అవకాశం దొరికింది. సాధారణంగా కార్యక్రమాన్ని బట్టి రూ.500 నుంచి రూ.1500 దాకా వసూలు చేస్తారు. కానీ ప్రధాని కార్యక్రమం పైగా దేశ వ్యాప్తంగా క్రేజ్ ఉండటంతో ప్రకటనల కోసం పలు సంస్థలు పెద్ద మొత్తంలో చెల్లించేందుకు ముందుకు వస్తున్నాయని తెలుస్తోంది. దీంతో ఈ కార్యక్రమం సందర్భంగా ప్రసారం చేసే యాడ్ విలువ ఒక్కసారిగా రికార్డు స్థాయిలో రూ.2లక్షలకు పెరిగిందని సమాచారం. ఈ నెల 22 న ప్రసారం కాబోయే మన్ కీ బాత్ సందర్భంగా ఈ తరహా యాడ్ కోసం గ్లాక్సో స్మిత్ క్లైన్ యాడ్ స్లాట్ ను బుక్ చేసుకుందని తెలుస్తోంది. ఈ సంస్థ ఉత్పత్తి హార్లిక్స్ ప్రకటన ఆదివారం మన్ కీ బాత్ లో సందడి చేయనుందన్న మాట.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ