వావ్! కన్నయ్య నాలుక్కి భలే గిరాకీ

March 05, 2016 | 03:17 PM | 2 Views
ప్రింట్ కామెంట్
Kanhaiya-tongue-BJYM-niharonline

దేశద్రోహం కేసులో ఢిల్లీ జేఎన్-యూ యూనివర్సిటీ నేత కన్నయ్యకుమార్ ఫిబ్రవరి 12న అరెస్ట్ కాగా, ఢిల్లీ హైకోర్టు ఆరు నెలల మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో గురువారం విడుదలైన విషయం తెలిసిందే. పార్లమెంట్ పై దాడి దోషి అఫ్జల్ గురు తన కు ఆదర్శం కాదని, హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ విద్యార్థి రోహిత్ వేముల తనకు మార్గదర్శకుడని కన్నయ్య విడుదల సందర్భంగా ప్రకటించిన విషయం కూడా విదితమే. అయితే ఆ టైంలో మాత్రం పార్లమెంట్ పై దాడి చేసిన ఉగ్రవాది అఫ్జల్ గురుకి మద్ధతుగానే నినాదాలు చేసినట్లు కన్నయ్యపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి.

ఇక దేశద్రోహులకు మద్దతుగా నినాదాలు చేసిన జవహర్ లాల్ నెహ్రూ విద్యార్థి సంఘం నాయకుడు కన్నయ్య కుమార్ నాలుకకు భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) నాయకుడు ఒకరు వెల కట్టారు. ఎవరైతే కన్నయ్యకుమార్ నాలుక తెగ్గోసిన వారికి 5 లక్షల రూపాయల బహుమానం ఇస్తానని ప్రకటించేశారు.

        జేఎన్ యూ విశ్వవిద్యాలయంలో ఫిబ్రవరి 9న జరిగిన కార్యక్రమాన్ని ఉత్తరప్రదేశ్ లోని బుదాన్ జిల్లా బీజేవైఎం అధ్యక్షుడు కుల్ దీప్ వర్ష్నే ఖండించారు. ఆ రోజు యూనివర్సిటీలో జరిగినదాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. అది దేశ ద్రోహమా కాదా అనేది కోర్టు తేల్చాల్సి ఉందని, న్యాయవ్యవస్థ, రాజ్యాంగం పట్ల తమకు నమ్మకముందన్నారు. జాతి వ్యతిరేక నినాదాలు చేయడం ద్వారా కన్నయ్య ప్రతి ఒక్కరినీ లక్ష్యంగా చేసుకున్నాడని వర్ష్నే అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఓ అడుగు ముందుకు వేసి పై ఆఫర్ ప్రకటించారు. అయితే దీనిపై బీజేపీ అధిష్టానం ఆగ్రహాం వ్యక్తం చేసింది. క్రమశిక్షణ చర్యల క్రింద ఆనేతను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించటం విశేషం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ