ఒక్క ఛాన్సిస్తే కుమ్మేస్తానంటున్న స్టార్ నటి

March 03, 2016 | 02:33 PM | 4 Views
ప్రింట్ కామెంట్
kushboo-tamilnadu-assembly-election-niharonline

తమ గ్లామర్ తో సినీ రంగంలో రాటుదేలి రాణించిన నాయికామణులు ఇప్పుడు రాజకీయాల్లోకి ఎంటర్ అవుతున్నారు. ఈ లిస్ట్ లో విజయశాంతి, రోజా, రమ్య, ఇలా అంతా చిన్న వయసులోనే పొలిటికల్ పాఠాలను వంట పట్టించుకున్నారు. కొన్నాళ్లు ఏలి విజయశాంతిలాంటి వారు కనుమరుగైపోతే, రోజా లాంటి వారైతే ఇప్పుడిప్పుడే పదునెక్కుతూ  ప్రత్యర్థులపై ఎలాంటి విమర్శలు చేస్తుంది మనం చూస్తున్నాం. ఇక ఇప్పుడు ఇదే లైన్ లోకి వచ్చేందుకు తన ప్రయత్నాలు ప్రారంభిస్తోంది ఒకప్పటి కోలీవుడ్ స్టార్ నటి కుష్బూ. ఇప్పటికే ఏకంగా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న ఆమె త్వరలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేందుకు పావులు కదుపుతోంది.

                              అధిష్ఠానం అవకాశమిస్తే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని సినీ నటి కుష్బూ పేర్కొన్నారు. చెన్నైలో విలేకరులతో ఆమె మాట్లాడుతూ... అసెంబ్లీ ఎన్నికలలో తాను పోటీ చేయాలని కోరుతూ పార్టీకి చెందిన పలువురు నాయకులు తన తరపున దరఖాస్తులు చేశారని చెప్పారు. పార్టీ అధిష్ఠానం అవకాశమిస్తే పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానంటూ ఆమె తన మనసులో మాటను బయటపెట్టారు.

పనిలో పనిగా డీఎండీకే అధ్యక్షుడు విజయ్ కాంత్ ను కాంగ్రెస్ కూటమిలో చేర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. కాంగ్రెస్ తో పొత్తు విషయమై ఆయన ఇంకా తన నిర్ణయాన్ని చెప్పలేదని.. తమ పార్టీలో విజయ్ కాంత్ చేరాలనే తాను ఎదురుచూస్తున్నానని చెప్పారు. జాతీయ ప్రతినిధిగా ఉండటంతో ఆమె సొంత పనులు చేసుకోలేకపోతున్నందునే ఇలా ఎమ్మెల్యేగా మారాలని చూస్తోందని ప్రత్యర్థులు అప్పుడే ఆమెపై సెటైర్లు వేయటం మొదలుపెట్టారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ