ఫ్రెండ్లీ బాబా బీజేపీని తిట్టి, రాహుల్ ను పొగిడాడు

May 21, 2015 | 05:22 PM | 21 Views
ప్రింట్ కామెంట్
ramdev_priases_rahul_and_abuse_modi_ministers_niharonline

బాబా రాందేవ్ బీజేపీ కి మంచి మిత్రుడు. గతేడాది సార్వత్రిక ఎన్నికల సమయంలో బీజేపీ తరపున ప్రచారం కూడా చేసిన తన వంతు బాధ్యతను పోషించాడు. అలాంటి వ్యక్తి ని మోదీ ఏడాది పాలన గురించి అడిగితే ఏం చెప్తాడు. ఖచ్ఛితంగా విరుద్ధంగా చెప్పడని అంతా అనుకుంటారు. కానీ, ఊహించని రీతిలో ఆయన కామెంట్లు చేశాడు. మోదీ, జైట్లీ, అమిత్ షా మినహా మిగతా వారందరూ ఫోన్ నంబర్లు మార్చేశారట. ఎన్నికల ముందు ఒకలాగా, తర్వాత ఒకలాగా ప్రవర్తిస్తున్నారట. ఈ తరహా వైఖరి పట్ల ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆయన బీజేపీ నేతలకు చెబుతున్నారు. అయితే ఏమనిపించిందో ఏమో బీజేపీ నేతలను తిట్టిపోసిన అదే నోటితో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని పొగడ్తలతో ముంచెత్తాడు. చచ్చిపోతున్న కాంగ్రెస్ కి రాహుల్ మళ్లీ పునర్జీవనం పోస్తున్నాడని కితాబిచ్చాడు. జడత్వం ఆవరించిన పార్టీని మళ్లీ గాడిలో పెట్టాడని కొనియాడారు. రైతుల సమస్యల పైనే ప్రతిపక్షాలు ఆయుధంగా చేసుకున్న ఈ సమయంలో ముందు ఈ సమస్య పట్ల కేంద్రం దృష్టిసారించాల్సి ఉందని కేంద్రానికి ఆయన సూచించారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ