తెలంగాణలో చెరువుల పునరుద్ధరణ కోసం ప్రతిష్టాత్మకంగా 'మిషన్ కాకతీయను' చేపట్టిన విషయం తెలిసిందే. ఇందుకోసం ఎన్నారైలు, సెలబ్రిటీల నుంచి సాయం కూడా కొరుతుంది. బహుశా మరి దీన్నే ఏపీ సీఎం చంద్రబాబు కూడా ప్రేరణగా తీసుకున్నారేమో. తాజాగా రాష్ట్రంలో చెక్ డ్యాంల నిర్మాణ పనులను చేపట్టడంతోపాటు చెరువుల్లో పూడిక తీయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. అనుకున్నదే తడవుగా ప్రతిజిల్లాకు రూ.5 కోట్లు కేటాయింస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అంతేకాదు చెరువుల పూడికతీత కార్యక్రమంలో స్వయంగా పాల్గొంటానని చంద్రబాబు చెప్పారు. జన్మభూమి, మా ఊరు కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను మార్చి నుంచి జూన్ దాకా కొనసాగించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.