తెలంగాణలో కులసంఘాల కుమ్ములాట షురూ

February 04, 2015 | 12:00 PM | 30 Views
ప్రింట్ కామెంట్

విభజన ఫలితం ఒక్కోరోజు ఒక్కో వ్యవస్థాపక రంగాల్లో దాని ప్రభావం చూపుతోంది. కానీ, కులసంఘాల పై దీని ఎఫెక్ట్ ఉండబోతుందని బహుశా ఎవరు ఊహించి ఉండకపోవచ్చు. రాబోయే రోజుల్లో తెలంగాణలో కమ్మ సంఘం ప్రత్యేకంగా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు కొంతమంది ఆ సామాజిక వర్గపు నాయకులు. తమపై ఆంధ్రోళ్లు అని ముద్రవేయకుండా తెలంగాణ వారిగానే గుర్తించాలని వారు కొరుతున్నారు. ఓ వైపు ఈ చర్చ జరుగుతుండగానే కొల్లూరి విశ్వనాథంలాంటి కొంత మంది ప్రముఖులు మంత్రి తుమ్మల నాగేశ్వరావును కలిసి ఈ అంశంపై చర్చించారట. ఆంధ్రాలోనే కాదు తెలంగాణలో కూడా ఈ సామాజిక వర్గ జనాభా అధికంగానే ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో సెటిలర్లు దాదాపు ఈ కులం వారే. అక్కడ మోస్ట్ డామినేటింగ్ గా ఉన్న ఈ కులాన్ని ఉన్నంతలో ఇక్కడ తెలంగాణలో కూడా బాగా వాడుకోవాలని టీఆర్ఎస్ కూడా ఆలోచిస్తుందట. ఇక ఇదే కులంకు చెందిన ప్రతిపక్ష నేతలు కొందరు కుల సంఘాల మధ్య చిచ్చుపెట్టి కేసీఆర్ లాభపడాలని చూస్తున్నాడని విమర్శిస్తున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ