మాట మార్చిన మాజీ పోలీస్ బాస్

February 10, 2015 | 05:34 PM | 28 Views
ప్రింట్ కామెంట్
kiran_bedi_uturn_on_delhi_defeat_niharonline

ఢిల్లీ ఎన్నికల్లో దారుణమైన ఓటమితో చతికిల పడ్డ బీజేపీకి ఇప్పుడు పుండు మీద కారంలా మరో పంచ్ పడింది. పార్టీ ఓటమికి తానే బాధ్యత వహిస్తానని మొదటి నుంచి మొత్తుకుంటు వస్తున్న బీజేపీ సీఎం అభ్యర్థి కిరణ్ బేడీ సడన్ గా మాట మార్చారు. ఓటమి పాలైన బాధలో మాట్లాడారా లేక ఏమో తెలీదుకానీ దీనంతటికి బీజేపీయే కారణమని ఆమె అన్నారు. ‘‘అసెంబ్లీ ఎన్నికల్లో ఓడింది నేను కాదు. బీజేపీయే. జాతీయ పార్టీ అయిన బీజేపీ ఇంత దారుణమైన ఓటమికి గల కారణాలు విశ్లేషించుకోని ఆత్మ పరిశీలన చేసుకోవాలి’’ అంటూ సలహాలు ఇచ్చారు. ఆప్ తో ఉన్న అనుబంధాన్ని తెంచుకుని మరీ బీజేపీ లో చేరిన ఆమె పరిస్థితి ఈ దారుణ ఓటమితో రెంటికి చెడ్డ రేవడి లా అయ్యింది. ఈ వ్యాఖ్యలతో ఆమె రాజకీయ భవిష్యత్ ఎలా ఉండబోతుందో చూడాలి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ