టీడీపీలో మగాళ్లు లేక వైసీపీకి చెందిన చెందిన ఎమ్మెల్యేలను చంద్రబాబు కొని తీసుకెళ్తున్నారని వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. వలసలను ఉద్దేశించి ఆమె ఇలా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీలో మగవాళ్లున్నారో లేదో అందరికన్నా ఎక్కువ తెలిసింది రోజా కేనంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
‘అమ్మా రోజారెడ్డి గారు, మీరు కూడా తెలుగుదేశం పార్టీలో పనిచేశారు. పది సంవత్సరాల పాటు మాతో ఉన్నారు. ఎంతమంది మగవాళ్లతో ఉన్నారో మీకు తెలుసు? ఎంతమంది మగవాళ్లను చూశారో మీకు తెలుసు. తెలుగుదేశం పార్టీలో మగవాళ్లున్నారో లేదో అందరికన్నా ఎక్కువ తెలిసిన వారు మీరే రోజారెడ్డిగారు’ అని ఉమా వ్యాఖ్యా నించారు. ప్రభుత్వాన్ని కూలగొడతానన్న వైఎస్సార్సీపీ అధినేత జగనే కూలిపోయే పరిస్థితుల్లో ఉన్నారని విమర్శించారు.