దొరగారిది దొడ్డమనసు

July 30, 2015 | 03:45 PM | 2 Views
ప్రింట్ కామెంట్
T_CM_KCR_prathusha_at_home_niharonline

బాలల హక్కుల సంఘం, ఇక అజ్నాత మానవవీయుడి జోక్యంతో ప్రత్యూష, స్వంత తండ్రి, మారుటి తల్లి కబంధ హస్తాల నుంచి బయటపడింది. ఆస్పత్రిలో వైద్యంతో మొదలయిన ప్రత్యూష ప్రయాణం కేసీఆర్ క్యాంపు ఆఫీసులో ముఖ్యమంత్రి, హోంమంత్రి సరసన బువ్వతినే స్థాయికి చేరుకున్న వైనం, కేవలం కేసీఆర్ పెద్ద మనసుకి, ఔనత్యా సంస్కారానికి తార్కాణం!. లోకంలో ఇంకా మంచితనానికి నూకలున్నాయని ఆశాజీవులు గుండెనిండా ఊపిరిపీల్చుకోగలరు. రాష్ట్ర హద్దులు దాటి అభిప్రాయ బేధం లేకుండా మనసుగల వారందరూ ముక్త కంఠంతో ముఖ్యమంత్రి హృదయ వైశాల్యానికీ జేజేలు పలకవలసిన అపురూపు సంఘటన ఇది. మనిషిలోని మృగానికి కిరాతకానికి, పాశవికత్వానికి బలయిపోయిన చిన్నారి ప్రత్యూష తిరిగి సరికొత్త రంగుల జీవితాన్ని పున:ప్రారంభించాలనే దయతో కేసీఆర్ చూపిన చొరవ మాటల కందనిది. స్వయం ప్రకటిత దయానిధులు, సమాజసేవకులు, స్వామీజీలు, పీఠాధిపతులు, ప్రవచనా దురంగధులు ఇటువంటి సంఘటనల పట్ల ఆకర్షితులయితే చాలు. దారిచూపిన దేవుడికి శ్రమ తగ్గుతుంది. నువ్వు కష్టపడ చదువుకుని స్థిరపడితే అదే గుణపాఠం. అదేతగిన శిక్ష. నిన్నీ దుస్థితిలోకి నెట్టేసిన దుర్మార్గులకి అన్న కేసీఆర్ మాట సద్దిమూట!

ఇటువంటి కథలకు ముగింపు లేదు కాబోలు. మహబూబ్ నగర్ జిల్లా గట్టు గ్రామానికి చెందిన ఐదేళ్ల జయలక్ష్మి, తన అన్నది కూడా ఇదే మాదిరి దీనగాథ. అదృష్టవశాత్తు రాంబాబు అనే పోలీసు ఆఫీసరు ఆదుకున్నట్లుగా తెలిసింది. వీటి గురించి ఏంచెయ్యాలో అందరూ ఆలోచిద్దాం!

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ