యూనివర్సిటీల రచ్చపై నోరు మెదిపిన టీ సీఎం

March 26, 2016 | 11:57 AM | 1 Views
ప్రింట్ కామెంట్
kcr-on-universities-chaos-niharonline

దళిత స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య, ఉద్యోగాల కోసం ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు చేస్తున్న నిరసనలతో  గత కొద్ది రోజులుగా హెచ్ సీయూ, ఓయూలు అట్టుడికిపోతున్నాయి. కానీ, ఇంత జరుగుతున్న తెలంగాణ సీఎం చీమకుట్టినట్లైనా స్పందిచట్లేదని విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. దీంతో యూనివర్సిటీల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ఆయన ఎట్టకేలకు స్పందించారు.

                                   నేటి అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా వర్సిటీల్లో నెలకొన్న పరిస్థితులపై చర్చకు అనుమతించాలని విపక్ష కాంగ్రెస్ డిమాండ్ చేసింది. హెచ్ సీయూలో తన కారుపై జరిగిన దాడిపై నిరసన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యే పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా స్పందించిన కేసీఆర్... వర్సీటీల్లో చోటుచేసుకుంటున్న ఆందోళనలు విచారకరమన్నారు. ఎమ్మెల్యే సంపత్ కుమార్ కారుపై జరిగిన దాడి బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజా ప్రతినిధులపై జరిగిన దాడులను ఖండిస్తున్నామని ఆయన ప్రకటించారు. ఈ విషయంపై చర్చకు తాము సిద్ధంగానే ఉన్నామని ప్రకటించిన కేసీఆర్, ఏదైనా చర్చలోనే సభ్యులు తమ వాదనలు వినిపించాలని సూచించారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ