భార్యలను లాగి మరీ తిట్టుకుంటున్నారు

March 25, 2016 | 10:40 AM | 2 Views
ప్రింట్ కామెంట్
Trump-Cruz-wives-pics-twitter-niharonline

ఎన్నికల ప్రచారంలో దొరికిన విమర్శలను ఆయుధంగా చేసుకుని ముందుకెళ్లటం మనదేశంలో పరిపాటే. ఒక్కోసారి దిగజారి చేసే కామెంట్లు చేసుకోవటం కూడా మన నేతలకు అలవాటే. అయితే అగ్ర రాజ్యం అయిన అమెరికా కూడా అందుకు మినహాయింపు ఏం కాదని రుజువుచేస్తుంది. ప్రస్తుతం అక్కడ అధ్యక్ష పదవి పోటీలో ఉన్న అభ్యర్థులు ఒకరిపై ఒకరు చేసుకుంటున్న విమర్శలు చూసి నెటిజన్లు ఔరా అని ముక్కున వేలేసుకుంటున్నారు. రిపబ్లికన్ల తరఫున పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్, టెడ్ క్రూజ్ ల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు తారాస్థాయికి చేరి ఒకరి భార్యలను మరొకరు విమర్శించుకునే స్థాయికి చేరాయి.

                   టెడ్ క్రూజ్ భార్య హైదీ క్రూజ్ చిత్రాన్ని తన ట్విట్టర్ ఖాతాలో పెట్టిన ట్రంప్, 'స్పిల్ దీ బీన్స్' (అందాలను మరింతగా బయటకు తీయాలి అనే అర్ధం వచ్చేలా) అంటూ ట్యాగ్ లైన్ పెట్టారు. ఈ కామెంట్ వైరల్ అవుతుండగానే, దీనికి రీట్వీట్ చేసిన క్రూజ్ తనదైన శైలిలో స్పందిస్తూ, ట్రంప్ భార్య, మోడల్ మెలానియా దాదాపు నగ్నంగా ఉన్న చిత్రాన్ని సామాజిక మాధ్యమాల్లో ఉంచి "నో నీడ్ టు స్పిల్ ది బీన్స్" (అందాలను ఇంకా బహిర్గతం చేయాల్సిన అవసరం లేదు) అని కామెంట్ చేశారు.

కాగా, ఈ రెండు చిత్రాలూ వెయ్యి పదాల విమర్శలకు సమానమని నెటిజన్లు వ్యాఖ్యానిస్తుండగా, అసలు తన భార్యను ఎందుకు ఇలా లాగుతున్నారని, ఆమెను వదిలివేయాలని క్రూజ్ నిప్పులు చెరిగారు. వీరి ప్రచారం వ్యక్తిగత విమర్శలకు దారితీయడం, అందునా భార్యలను భాగం చేస్తూ, ఇలా అసభ్య పదజాలం, ఇబ్బందికర చిత్రాలను ప్రచారానికి వాడటం సరికాదని రాజకీయ నిపుణులు సలహా ఇస్తున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ