ఆప్ అధినాయకుడికి పదవీగండం!

March 02, 2015 | 03:31 PM | 52 Views
ప్రింట్ కామెంట్
kejriwal_AAP_Chief_resign_niharonline

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను సొంత పార్టీ పదవి నుంచి తొలగించేందుకు రంగం సిద్ధమైంది. ముఖ్యమంత్రి పదవి నుంచి కాదండీబాబూ... ఆమ్ ఆద్మీ పార్టీకి ముఖ్యమంత్రి పదవిలో ఉండి జాతీయ కార్యదర్శిగా ఆయన కొనసాగటంపై కొందరు తీవ్రఅభ్యంతరం లేవనెత్తారు. దీనిపై స్పందించిన ఆయన గతవారం తన రాజీనామాను కార్యవర్గ సమావేశంలో సమర్పించారు. అయితే సమావేశంలో కొందరు రాజీనామాను ఉపసంహరించుకోవాలని కొరగా, ఇంకోందరు మాత్రం ఆయన బదులు వేరేవారిని నియమించాలని కొరుతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం సమావేశం కానున్న జాతీయ కార్యవర్గ సమావేశంలో కేజ్రీవాల్ ను తొలగించినట్టు అధికారిక ప్రకటన చేసి, కొత్త కార్యదర్శిని ఎంపిక చేయవచ్చునని తెలుస్తోంది. ఇక ఈ సమావేశంలో లేవనెత్తిన అభ్యంతరాల ద్వారా కేజ్రీవాల్ నాయకత్వంపై కూడా కొంత మంది తీవ్ర అసంత్రుప్తితో ఉన్నారని తేటతెల్లమైంది. మరి భవిష్యత్ లో ఈ అంతరం ఆయనతో కార్యకర్తల సంబంధాలను మరింత పెంచదుకదా.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ