ఎడమ చెయ్యా! పుర చెయ్యా!

March 02, 2015 | 03:27 PM | 43 Views
ప్రింట్ కామెంట్
Jagmohan_Dalmiya_BCCI_president_niharonline

హాట్ హాట్ గా జరుగుతాయనుకున్న బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ ఇండియన్ క్రికెట్(బీసీసీఐ) ఎన్నికలు ఆశ్చర్యకరరీతిలో ముగిశాయి. శ్రీనివాసన్ నిష్క్రమణ తర్వాత ఏర్పడిన ఖాళీకి జరిగే ఎలక్షన్ల కోసం ఆదివారం సాయంత్రం నామినేషన్ల గడువు ముగిసింది. కేవలం ఒక్క నామినేషన్ మాత్రమే దాఖలు కావటంతో ఎంతో ఉత్కంఠంగా జరుగుతాయనుకున్న ఎన్నికలు ఎలాంటి పోటీలేకుండా ముగిశాయి. దాదాపు దశాబ్దం క్రితం బీసీసీఐను ఏలిన మాజీ చీఫ్ జగ్మోహన్ దాల్మియా తిరిగి కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని చెన్నైలో జరిగిన బీసీసీఐ సమావేశంలో ప్రకటించారు. పదవి కోసం కేంద్ర మాజీ మంత్రి, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఫలించలేదు. దీంతో చివరికి దాల్మియాకే మద్దతు పలకాల్సి వచ్చింది. దశాబ్దం క్రితం దాల్మియా బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయన పలు వర్గాల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కున్నారు. శ్రీనివాసన్ రాకతో తెరమరుగైన ఆయన తిరిగి శ్రీనివాసన్ తెరమరుగయ్యే సమయంలో బీసీసీఐ చీఫ్ గా ఎన్నికకావటం విశేషం. ఇక మరీ ఈయనగారి నేత్రుత్వంలో బీసీసీఐ ఎలా పనిచేస్తుందో !

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ